వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నపిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ పద్ధతుల్లో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు.

అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టితీస్తూంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు నిద్రలో కలవరింతలకు గురికావడం, నిద్ర నుంచి పదే పదే ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్ష ణాలు లేకుండా ఉంటాడని నమ్ముతారు.

Why they will do it for Children?

చిన్న ప్రిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుటూ అంతా చేరటంవల్ల
చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురి అవుతారు. అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటంవల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతోపాటు ధైర్య గుణంవస్తుంది.

నిజానికి దిష్టి అంటే దృష్టి. కొందరి చూపులు మంచివి కావనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ చెడు చూపు నుంచి దిష్టి రక్షణ ఇస్తుందని విశ్వసిస్తారు. అలాగే, ఉప్పుకళ్లు శరీరం చుట్టూ తిప్పి వాటిని మంటల్లో వేయడం కూడా దిష్టి తీయడంలో ఉంది.

English summary
There custom of Disti, which mean Dristi. It will be performed to the children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X