డిసెంబర్ 29 నుండి వీరికి తిరుగులేని ధనయోగం.. శివయ్య ఆజ్ఞ!
హిందూమతంలో ప్రతినెలా వచ్చే మాస శివరాత్రికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు కూడా భక్తులు శివుడిని విశేషంగా పూజించడంతో పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఆ శివుడి కటాక్షం కోసం మాస శివరాత్రిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర నెలలో వచ్చే మాస శివరాత్రి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది..
మాస శివరాత్రి.. అదృష్ట రాశులు
మార్గశిర మాసంలో ఈసారి మాస శివరాత్రి డిసెంబర్ 29వ తేదీన తెల్లవారుజామున 3.32 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 30వ తేదీన 4.01 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ప్రాతః కాలంలో ఉన్న తిధినే ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి 29వ తేదీనే మాస శివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈసారి వచ్చే మాసశివరాత్రి పలు అదృష్ట యోగాలను తీసుకురానుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి.

సింహరాశి
సింహరాశి జాతకులకు మాస శివరాత్రి నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ఇది అనేక విధాలుగా సింహ రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో కలిసొస్తుంది. ఈ నెలలో సింహరాశి జాతకులు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి మాస శివరాత్రి నుంచి భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి సంపద, శ్రేయస్సుతోపాటు అనేక విధాలుగా ఆదాయం చేకూరుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోయి పురోగతివైపు అడుగులు వేస్తారు.
మిధున రాశి
మిధున రాశి జాతకులు మాస శివరాత్రి నుంచి అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ రాశి వారికి శివుడి విశేషమైన ఆశీస్సులు ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వారికి భారీగా ఆదాయం సమకూరుతుంది. గృహాలు లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి పెట్టుబడులు పెడతారు. సమాజంలోనూ వారి ప్రతిభ తోటి మంచి గుర్తింపును సాధించుకుంటారు. ఇది మిధున రాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications