ఫిబ్రవరిలో మూడుసార్లు సూర్య సంచారంతో మూడువందల ప్రయోజనాలు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో ముఖ్యమైన సూర్య గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఫిబ్రవరి మాసంలో మూడుసార్లు తమ గమనాన్ని మార్చుకుంటాడు. గౌరవానికి, ప్రతిష్టకు కారకుడైన సూర్యుడు ఫిబ్రవరి ఆరవ తేదీన ధనిష్ఠ నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఫిబ్రవరిలో మూడుసార్లు సూర్య సంచారం
చివరిగా ఫిబ్రవరి 19వ తేదీన సూర్యుడు శతభిషా నక్షత్రం లోకి సంచారం చేస్తాడు. ఇలా ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సూర్య సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

ధనస్సు రాశి
ఫిబ్రవరి మాసంలో సూర్య సంచారంలో మూడుసార్లు మార్పుల వల్ల ధనుస్సు రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరిలో ధైర్య శౌర్యాలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ పనిలో కూడా మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి.
సింహరాశి
ఫిబ్రవరి మాసంలో సూర్య సంచారంతో సింహరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం బాగుంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. ఇది మీకు అన్ని విధాలుగా శ్రేయస్సును శుభాలను ఇస్తుంది.
మేష రాశి
ఫిబ్రవరి మాసంలో సూర్య సంచారంలో మూడు సార్లు మార్పులు జరగడం వల్ల మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు పనిలోనూ, వ్యాపారాలలోనూ గణనీయమైన పురోగతిని చూస్తారు. నూతన ఆదాయ వనరుల ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. నాయకత్వ పాత్ర చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications