ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటిస్తే ఇంట్లో డబ్బుకు లోటుండదు!
ఏ ఇంటిలో ఎల్లప్పుడూ ప్రేమ ,శాంతి ,ఆనందం తాండవిస్తాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంపద, కీర్తి ,శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆరాధన గురించి శాస్త్రాల్లో ప్రస్తావించారు. లక్ష్మి చాలా చంచలమైనది.. ఆమెను సంతోషపెట్టడానికి అనేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో మూడు సులభమైన పరిష్కారాలు చెప్పారు. రోజూ ఈ 3 పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే నివసిస్తుందని గట్టి నమ్మకం.
1. సుఖసంతోషాలు నిండిన ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ప్రతిరోజూ ఉదయం తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తర్వాత విష్ణువు, లక్ష్మిని పూజించాలి. పూజ చేసే సమయంలో లక్ష్మికి తామరపువ్వును సమర్పించాలి. దీని తర్వాత 'శ్రీసూక్తాన్ని' పఠిస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటుండదని నమ్ముతారు.

2. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి ముఖద్వారం వద్ద గంగాజలం చల్లుకోవాలి. పసుపు ,కుంకుమతో ప్రవేశద్వారం వద్ద స్వస్తిక్ ను తయారు చేయాలి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని నాశనం చేసి ఆ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నిండేలా చేస్తుంది. ఇంట్లో పెద్దలను, ఆహారాన్ని గౌరవించాలి. కలహాలు లేని ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. మహిళలు తమ రోజువారీ పూజ తర్వాత పొయ్యిని పూజిస్తారు కాబట్టి ఎల్లప్పుడూ సంపద, ఆహారం లోటు లేకుండా ఉంటాయి.
3. పురాణాల ప్రకారం విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తులసి లక్ష్మీదేవిని ద్వేషిస్తుందని, తులసిని ఐశ్వర్య దేవత పూజలో ఉపయోగిస్తే కోపం వస్తుందని ఎక్కువమంది నమ్ముతారు. లక్ష్మీదేవికి ఎర్రని పువ్వు చాలా ప్రీతికరమైనది కావడంతో లక్ష్మీని పూజించేటప్పుడు ఎర్రటి పూలను మాత్రమే వాడాలి.












Click it and Unblock the Notifications