రోహిణీ నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి ధనయోగం

గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. సూర్యుడు నక్షత్ర సంచారాలు చేస్తుంటాడు. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈనెల 25వ తేదీన సూర్యుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇది ఎంతో శుభప్రదం. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని రాశులవారికి మాత్రం విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి లాభాలుంటాయి. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. సమాజానికి దగ్గరగా ఉండి పనిచేస్తున్నవారికి ఈ సమయంలో పేరు ప్రతిష్టలతోపాటు గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. పై అధికారుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.

zodiac signs very lucky due to sun transit in rohini nakshatra 2024

కర్కాటక రాశి
ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. వీటితోపాటు వేతనం కూడా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుకు అందరూ ముగ్ధులవుతారు. జీవితంలో అన్నీ సానుకూల మార్పులే చోటుచేసుకుంటాయి. ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి.

కన్యారాశి
పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం తోడుండటంవల్ల ఎటువంటి పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రధానంగా విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్లి చదవాలనుకునేవారి కోరికలు సులభంగా నెరవేరతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్తగా ఆదాయ వనరులు లభిస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి
కుటుంబంలో తలెత్తిన సమస్యలు ఈ సమయంలో చక్కగా పరిష్కారమవుతాయి. దీనివల్ల అంతులేని సంతోషం కలుగుతుంది. ధనప్రవాహం వల్ల ఆస్తులు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+