రోడ్డుపై దొరికిన డబ్బును తీసుకుంటున్నారా?

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా డబ్బులు దొరికితే ఏం చేస్తారు? చాలా మంది వాటిని తీసుకుంటారు. కొందరు దొరికిన డబ్బును దానం చేస్తారు, మరికొందరు- తీసుకోవచ్చా? తీసుకోకూడదా?, ఇది శుభమా, అశుభమా అనే సందేహంలో పడతారు. తీసుకుంటే మంచి జరుగుతుందో? చెడు వెంటాడుతుందో అనే అనుమానాలు తలెత్తుతుంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం- రోడ్డు మీద డబ్బు దొరకడం అనేది శుభసూచకం. మీ జీవితంలో జరగబోయే సానుకూల సంఘటనలకు సూచిక కావచ్చు.

దారిలో దొరికిన నోట్లు లేదా నాణేలను వెంటనే తీసుకోవాలి. జ్యోతిష్యపరంగా ఇది రాబోయే జీవితానికి శుభ సూచకం. ఇలా అనుకోకుండా దొరికిన డబ్బు.. ఒక్కరూపాయి అయినా సరే- అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని, మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచికగా చెబుతుంటారు వాస్తు పండితులు. దొరికిన ఈ డబ్బును ఇతరులకు దానం చేయకూడదు కూడా. ఒక రూపాయి, ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణెం దొరికితే, దాన్ని దైవశక్తికి ప్రతీకగా భావించాలి.

రోడ్డుపై దొరికిన నాణెం మీరు త్వరలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని సూచిస్తుంది. ఈ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాలను రెండింటినీ అందిస్తుంది. ఈ ప్రయత్నంలో మీకు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. నాణేలు లోహంతో తయారవుతాయి, లోహం దైవశక్తికి ప్రతీక. నాణెం దొరికితే, దేవి అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం. నాణెం దొరకడం అంటే మీ పురోగమనానికి చిహ్నం. ధనం, పాజిటివ్ ఎనర్జీ మీ వెంట ఉందనడానికి ఇది నిదర్శనం.

రోడ్డుపై నోటు దొరికితే, లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం. దాన్ని పర్సులో భద్రంగా ఉంచుకోవాలి. మీకు ఏ సమయంలో డబ్బు దొరికింది అనే దానిపై కూడా వివిధ సంకేతాలు ఆధారపడి ఉంటాయి. ఉదయం ఇంట్లో నుండి బయలుదేరిన తర్వాత డబ్బు దొరికితే, మీ దశ తిరిగిందని అర్థం. కొందరికి నాణెం లేదా నోటు కాకుండా, డబ్బుతో నిండిన పర్సు కూడా దొరుకుతుంది. అలాంటి వారికి చాలా వారసత్వ సంపద లభించే అవకాశాలు ఉన్నాయని సంకేతం. భవిష్యత్తులో శుభ వార్తలు వింటారనడానికీ ప్రతీక.

ఒకవేళ డబ్బుతో నిండిన పర్సు మీకు దొరికితే, త్వరలో మీ జీవితంలో శుభం జరుగుతుందని సంకేతం. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి లభించే అవకాశం కూడా దీని ద్వారా ఉంటుంది. మీ ప్రగతికి ఇది సూచన. అందుకే ఆ డబ్బును భద్రంగా ఉంచుకోవడం ముఖ్యం. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, ముందుకు సాగాలని ఇది సూచిస్తుంది.

Disclaim: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారం ఆధారంగా సేకరించినది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+