అత్యంత అరుదైన శని చంద్రగ్రహణం: ఈ రాశుల వారికి కష్టాలు: దోష పరిహారం ఇదే

Shani Chandra Grahan 2024: సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాల గురించి మనకు తెలుసు. వాటిని ప్రతి సంవత్సరం చూస్తుంటాం. సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు.

చంద్ర గ్రహణం..

చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంటుంది. ఆ సమయంలో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది.

Shani Chandra Grahan 2024 India witnessed Saturn Eclipse also known as Lunar Occultation of Saturn

శని చంద్ర గ్రహణం..

వీటికి భిన్నంగా శని చంద్ర గ్రహణం గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువే. సూర్య, చంద్ర గ్రహణాల్లాగా ఇది ప్రతి సంవత్సరం సంభవించదు. అందుకే దీన్ని అరుదుగా భావిస్తారు. ఇప్పుడు తాజాగా ఈ శని చంద్రగ్రహణమే దేశంలో ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఇది కనువిందు చేసింది.

భారత్‌లోని ఏఏ ప్రాంతాల్లో..

ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి, గుజరాత్‌లోని రాజ్‌కోట్, ముంబైలోని చెంబూర్ ప్రాంతాలవాసులు మాత్రమే ఈ అత్యంత అరుదైన శనిచంద్రగ్రహణాన్ని వీక్షించగలిగారు. భూమి- చంద్రుడు- శనిగ్రహం ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడింది. చంద్రుడు నేరుగా శనిగ్రహం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు భూమిపై ఉన్న వారికి శనిగ్రహం కనిపించదు.

అరుదుగా..

శని చంద్రగ్రహణం సంభవించడం 18 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. శని చంద్ర గ్రహణం లేదా శని గ్రహ స్థితిగా దీన్ని పిలుస్తారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇది ఏర్పడింది. శని చంద్రగ్రహణ కాలం సుమారు గంట పాటు కొనసాగింది. రాత్రి 1:30 నుంచి 2:25 నిమిషాల వరకు కనువిందు చేసింది.

ఏఏ దేశాల్లో..

భారత్‌తో పాటు శ్రీలంక, చైనా, జపాన్‌లల్లోనూ పాక్షికంగా కనిపించిందీ అంతరిక్ష అద్భుతం. శనిగ్రహాన్ని దాటుకుంటూ చంద్రుడు ప్రయాణించిన అద్భుత దృశ్యాన్ని ఆయా దేశాల ప్రజలు టెలిస్కోప్‌ల ద్వారా దీన్ని వీక్షించగలిగారు.

ఈ అయిదు రాశులపై..

జ్యోతిష్యపరంగా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయిదు రాశులవారిపై శని చంద్రగ్రహణం దుష్ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుంభం, మీనం, మకరం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారకి కష్టాలు తప్పకపోవచ్చని స్పష్టం చేశారు. దోష పరిహారం కోసం శనిదేవుడికి తైలాభిషేకం, ప్రత్యేక పూజలు చెయ్యాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+