హేవలంబి నామ సంవత్సరం: మకర రాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం - 14 వ్యయం -14 రాజ్యపూజ్యం -3 అవమానం -1

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. అధికారుల మన్ననలు, రచయితలకు పుస్తకాలు అచ్చువేయించే వారికి, గురువులకు మరియు పత్రికా రంగములో ఉన్న వారికి మంచి కాలము. సంఘములో గౌరవ మర్యాదలు పొంది, మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. దైవ కార్యములపై శ్రద్ధ పెరిగి, చాలా దైవ కార్యములు, పూజలు చేస్తారు. గురువుల ఆశీర్వాదము పొంది, శుభ కార్యములు చేస్తారు. అన్ని చోట్ల నుండి ధనము లభించును. చేతిలో సొమ్ము ఎల్లప్పుడు ఉంటుంది. పంట పొలాలు, వాహనాల కొనుగోలు చేస్తారు. పెళ్లికాని వారికి, వారు తలచిన వ్యక్తి లభిస్తుంది. వివాహితులకు సంతాన యోగ్యము, రుచికరమైన భోజనాలు, శారీరక సౌఖ్యము లభించును. ఆరోగ్యము, దూర ప్రయాణాలు చేయుటకు ప్రయత్నాలు.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ దశ మీ జీవితములో కష్టాల్ని తెస్తుంది. మీరు చెడ్డ తనముతో ఆలోచిస్తారు. కొన్ని పనులు పూర్తి కానందున మీకు అసహనముగా ప్రవర్తిస్తారు. శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి, లేదా అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తుంది. ఇంట్లో పెద్ద వారితో, ఉద్యోగములో పై అధికారులతోను వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. జాగ్రత్తగా లేనిచో మీ పదవి పోగొటుకొని, గౌరవాన్ని కూడా పోగొటుకొని, ఇష్టము లేని దూర ప్రాంతాలకు బదలీ అవుతారు. ధనమును, ఆసులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రద్ధ అవసరము, ඩීහූළු ఆరోగ్య భంగము, కండ్ల జబ్బులు, మరియు గొంతునొప్పి వంటివి సంభవము. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము, లేనిచో నిరుత్సాహము, నిస్సత్తువ వంటివి సంభవము. మీ అశ్రద్ధ వలన మీ పిల్లలు అనారోగ్యమునకు గురి కాగలరు. వారి ఆరోగ్యానికి హాని ముంచుకొస్తుంది.

The Raasi Phalas of Hevalambi makararasi

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రగమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశలోఖర్చులు ఎక్కువవుతాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు చేయుదురు. వ్యవసాయదారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలెను. శత్రువుల వలన ధన నష్టము సంభవించవచ్చును. ధనమును మితముగా ఖర్చుచేయవలెను. ఆరోగ్య శ్రద్ళ అవసరము, భార్యా, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ వహించాలి. కాళ్లు, నేత్ర రోగములు వచ్చే అవకాశము ఉండవచ్చును. వృత్తి వ్యవహారముల యందు శ్రద్ధ అవసరము. జాగ్రత్తగా మసలు కొనవలెను.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశలో మంచి మార్పులువచ్చును. ఆర్ధికముగా మంచి కాలము. అనుకోని ధన లాభము, దీనిచే మరిన్ని మంచి అవకాశాలు సంభవించును. ಸ್ಥಿರ್ದ್ದಿ కొనగలరు. ఏపని తలపెట్టినా కార్యసిద్ధి, భవంతులు కట్టేవారు, బ్యాగులు అమ్మేవారు, వర్తకులు మంచి లాభమును గడించెదరు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించును. పై చదువులకు ఉన్నత స్థానము విపరీతమైన ఉద్రేకము కలుగును. పంఘములో మంచి పేరు, గౌరవ మర్యాదలు పెరుగును. కొంతమంది సన్మానింపబడుదురు. పెళ్లికాని వారికి, పెళ్లి యోగము ఉండవచ్చును. స్నేహితుల సహవాసము, కొత్త స్నేహితులు లభించును. మీ క్రింద పనిచేసే వారు, దాసీలు, మీకు ఎంతగానో సహాయము చేయుదురు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు ఆనందమునితురు. గృహములో సుఖసంతోషాలు, ఆరోగ్యము బాగుండగలదు.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. వృత్తి వ్యవహారములలో కొన్ని మార్పులు చేస్తారు. ప్రయాణాలు సంభవము, వేరే దేశ ప్రయాణాలు ఉండవచ్చును. కాని, చాలా వ్యయముతో కూడుకున్నదిగా ఉండవచ్చును. అయిన వారితో విరోధములు, శాంతిగా ఉండాలి. జీవితములో నిరుత్సాహము పొందగలరు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నపుడు ప్రత్యేకమైన జాగ్రత్త అవసరము. నిర్లక్ష్యముగా పని చేస్తారు. మీకు అపఖ్యాతి తెచ్చే ఏ పని చేయరాదు.
ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, ఈ దశ ఆరోగ్యానికి హానికరమైనది. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము. అంటు రోగములు, శృంగార రోగములు వచ్చు అవకాశమున్నవి. భీతి, ఆరోగ్య భంగము, ఎవరైతే 'మరక దశలో వారి జన్మరాశిలో వెళ్లారో వారు కోరి ప్రమాదములు తెచ్చుకొనగలరు. వృత్తి వ్యవహారములలో చెడ్డగా ప్రవర్తించిన, లంచము తీసుకొన్న జైలు శిక్ష అనుభవించే అవకాశమున్నది. కేతువు ద్వితీయమునందు ప్రవేశము:-
ఈ కాలములో ధన నష్టము సంభవించవచ్చును. ఖర్చులు విపరీతముగా పెరుగును. ఇంట్లో దొంగతనము కూడా జరుగవచ్చును. ఋణములు చేయుట మంచిది కాదు. చంద్రుని బలము చేత మీకు ఆరోగ్య భంగము కలుగును. మనశ్శాంతి కరువగును. కనులపై శ్రద్ధ వహించాలి.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ మీకు మంచిది కాదు. స్థిరాసుల కొనుగోలు విషయములో దూరముగా ఉండాలి. లేదా నష్టము వాటిల్లే అవకాశము ఉండవచ్చును. కాని, అనుకోని రీతిలో వృత్తి వ్యాపారములందు ధనార్థన కలుగవచ్చును. గృహమునందు విరోధాలు, విభేదాలకు దూరముగా ఉండుట మంచిది. స్నేహితులతోను, బంధువర్గమువారితోను, స్నేహితులతోను కలసి మెలసి మెలుగుటకు ప్రయత్నించగలరు. కేతువు లగ్నమునందు ప్రవేశము:- ఆరోగ్య భంగము, సొంత హాని/ప్రమాదము తెచ్చే ఏపని చేయవలదు. ప్రశాంతముగా ఉండుటకు ప్రయత్నించవలెన, లేనిచో శారీరక అలసట మిమ్మల్ని వేధిస్తుంది. శిరోవేధన కలుగవచ్చును. గృహములో అనవసరముగా ఎవరితోను వాదోపవాదములు పనికి రావు. గృహములో బంధువర్గము వారితో విరోధములు కలుగవచ్చును.

కుంభ రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...