హేవలంబి నామ సంవత్సరం: మేషరాశి ఫలితాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)

ఆదాయం - 8 వ్యయం - 14 రాజ్యపూజ్యం - 04 అవమానం - 03
గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రగమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ సమయములో మీ జీవితములో చాలా చిక్కులు వచ్చును. ఇంటా, బయటా చెడ్డగా వ్యవహరించుట వలన శత్రువులు ఎక్కువ అవుతారు. మీరు అందరికి శత్రువుగా మారతారు. మీ శత్రువులు మిమ్మల్ని మరిన్ని కష్టాలకు గురి చేయగలరు. కావున, జాగ్రత్త అవసరము. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము, సంతోషముగా లేక అలసిపోతారు. సరైన ఔషధ సేవ అవసరము. పనియందు జాగ్రత్త అవసరము. లేనిచో ధనము, దొంగతనము, అగ్ని ప్రమాదము, ప్రభుత్వముచే ఏ తిరుగబాటు, మొదలగునవి చేయు వృత్తి వ్యవహారములలో జరుగును. ఉద్యోగులు, పైఅధికారులతోను, సహ ఉద్యోగులతోను కలసి మెలసి మెలగాలి. కొత్త సనులను వాయిదా వేయాలి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోను తగువులు తెచ్చుకోకుండా అనవసరపు విషయాలలో తలదూర్చకుండా మసలుకోవాలి.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ దశ మీ జీవితములో మంచి రోజుల్ని తెస్తుంది. శారీరక సౌఖ్యము, వస్తులాభము, మంచి పదార్గాలు భుజించుదురు, ఆస్థి కొనుగోలు విశ్రాంతిగా ఉండుట మరియు పై అధికారుల వలన గౌరవము పొందుట వంటివి సంభవము. సంఘములో కూడా మీకు ఉన్నతమైన కాలము, సజ్జనులతో సహవాసము, తద్వారా లబ్ది పొందుదురు. మీ వాక్కు చాతుర్యముతో మరియు చలాకీగా వ్యవహరించుట వలన అందరిని ఆకటుకొందురు. ఈ సమయములో పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. ఆరోగ్యము బాగుగా ఉంటుంది. మీ మంచి తనమును అందరు గుర్తిస్తారు. గృహములో సంతోషమైన, విలాసవంతమైన జీవితము గడుపుతారు. పెళ్లికాని వారికి వివాహ యోగము, వివాహితులకు సంతాన యోగము ఉన్నవి. కొత్తగా పెళ్లయిన వారికి వారి దాంపత్య జీవితము సాఫీగా సాగుతుంది.

The Raasi Phalas of Hevalambi mesha

శని 07ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. కష్ట కాలము, వృత్తి వ్యవహారములు కలసి రావు. పని నష్టము సంభవించును. దురలవాటు, వ్యసనములు, చెడ్డవారితో సహవాసము, కొంతమంది జైలు పాలగుదురు. సంఘములో అపకీర్తి సంభవించవచ్చును. ప్రయాణాలు సంభవించును. మితముగా ఖర్చు పెట్టవలసి వచ్చును.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశ మిమ్మల్ని నిరుత్సాహ పరచును. వృత్తి వ్యవహారములలో కష్టకాలము, ఉద్యోగములో వేరే చోటికి బదిలీలు జరిగి, ఎక్కువ కష్టించవలసి వచ్చును. ఇతర ఉద్యోగులతోను, శత్రువులతోను జాగ్రత్తగా మసలు కోవలెను. మంచి పేరు తెచ్చుకొనుటకు బాగా కష్టించి కృషి చేయాలి. ధనవిషయాలలో జాగ్రత్త అవసరము. అనవసర ఖర్చులు చేయుదురు. ఎక్కువ సంపాదనకు కష్టించి పని చేయవలెను. ఇబ్బందులు ఎదుర్కొందురు. చెడ్డ పనులకు దూరముగా ఉండాలి. బుద్ధి భ్రంశము కలుగవచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. మనశ్శాంతి ఉండదు. భార్య, పిల్లల ప్రవర్తన చింతను పెంచును. మీ పుత్రుని ఆరోగ్యము క్షీణించును. దగ్గర బంధువులకు మరణము సంభవించును.

శని అక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. ఆరోగ్యముపై శ్రద్ధ చూపవలెను. ఆరోగ్య భంగము, ఇంటి పనులలో మీపై ఒత్తిడి పెరుగును. నక్షత్ర బలముచే కష్టకాలము ఎదుర్కొందురు. అయిన వారిని పోగొట్టు కొందురు. అనవసర విరోధములు తెచ్చుకొని గృహములోనే కొత్త శత్రుత్వము పెంచుకొందురు.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, బాధాకరమైన కాలము. సంతానము వలన ఇబ్బందులు, ఆర్థికముగా మంచిది కాదు. మితముగా ఖర్చు చేయుట మంచిది. తల్లిదండ్రుల మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యమునకు భంగము, పుత్ర దోషము వలన సంతాన విషయాలు మిమ్ములన, పిల్లలను బాధించును. ඩීදාළු ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాలి. కేతువు ఏకాదశమునందు ప్రవేశము:-

ఈ దశ మీ ధనార్ధనకు, స్థిరాస్థి కొనుగోలుకు దోహద పడును. కార్యసిద్ధికి మంచి కాలము, మీరు కొత్త పనిని చేపట్టి, తద్వారా ఎక్కువ పెటుబడి పెట్టి ఆశించిన దాని కన్నా ఎక్కువ ధనలాభమును పొందగలరు. మీలో కొంతమంది అనుకోని విధముగా ధనార్థనను గడిస్తారు. గృహమునందు, మీకు పెళ్లికాని పిల్లలు ఉన్నటైతే వారికి మంచి సంబంధాలు కలిగి పెళ్లి నిశ్చయమగును.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ అంత మంచిది కాదు. స్థిరాస్థిని కొనుగోలు విషయములో అతి జాగ్రత్త వహించవలెను. స్థల మార్పులు చేయుట అవసరము. స్థిరాస్థి కొనే ఆలోచన పక్కన పెట్టండి. రోగములు రాకుండా జాగ్రత్త పడగలరు. భార్య, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. అన్ని విషయాలపైన ఆసక్తి తగ్గి గాబరా పొందుదురు. కేతువు దశమమునందు ప్రవేశము:-

చంద్రుని ప్రవాసముచే మిశ్రమ ఫలితములు కలుగును. ఈ కాలములో అనుకోని వ్యక్తుల వలన మీకు ధనార్ధన కలుగవచ్చును. వృత్తి వ్యవహారములలో ఎదుగుదల కలిగి, ధనాదాయము కలుగవచ్చును. అయితే, చెడు స్నేహితుల వలన కొందరికి ధన నష్టము కలిగి వస్తు నష్టము కూడా కలుగును. వృత్తి వ్యవహారములందు, వ్యాపారములందు అభివృద్ధి తగ్గవచ్చును. మనశ్శాంతి కోల్పోవుదురు.

వృషభరాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...