బండి భగీరథ్‌‌ పోక్సో కేసు: ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్!

బండి భగీరథ్ పోక్సో కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా బండి భగీరధ్ కు అనుకూలంగా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బండి భగీరథ్‌కు మద్దతుగా వీడియోలు, పోస్టులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భావించి పోలీసులు ఈ చర్యలకు దిగారు.

బండి భగీరథ్ కోసం పోస్టులు.. 14 మందిపై కేసులు

బండి భగీరధ్ కు అనుకూలంగా పోస్టులు పెట్టటం కోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 27 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఫిర్యాదులు రాగా, వాటిపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, ప్రాథమిక ఆధారాలు దొరికడంతో మొదటి విడతలో 14 మందిపై అధికారికంగా కేసులు నమోదు చేశారు.

bandi bhageerath pocso case Police registered cases on social media influencers supporting Bandi Bhageerath

ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీడియోలు, ఫోటోలు, పోస్టులు

మిగిలిన వారిపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బండి భగీరథ్ పోక్సో కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు భగీరథ్ తప్పు చేయలేదని, అతడిని కావాలని ఇరికించారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీడియోలు, ఫోటోలు, పోస్టులు వైరల్ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. భారీగా డబ్బు తీసుకుని కుట్రపూరితంగా ఈ ప్రచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితులకు సంబంధించి తప్పుడు ప్రచారం

అంతేకాకుండా, బాధితుల వివరాలు, ఫోటోలు వెల్లడి చేయడం వంటి చర్యలు కూడా చట్టవ్యతిరేకమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయడం ద్వారా కేసు విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. పెట్ బషీరాబాద్ పోలీసులు ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా అకౌంట్లు, లింకులు, యూఆర్‌ఎల్‌లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.

దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు హబ్‌గా హైదరాబాద్.. ముంబైకి మూడు గంటల్లోనే!
దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు హబ్‌గా హైదరాబాద్.. ముంబైకి మూడు గంటల్లోనే!

తప్పుడు ప్రచారం, ఆర్ధిక లావాదేవీలతో కంటెంట్ సృష్టిపై పోలీసుల లోతైన దర్యాప్తు

బాధితురాలి గుర్తింపు రక్షణ, పోక్సో చట్టం నిబంధనలు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద సంబంధిత సెక్షన్లు వర్తింపజేసి కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు బండి భగీరథ్ పోక్సో కేసుపై జనాల ఆసక్తిని పెంచాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఆర్ధిక లావాదేవీలతో కంటెంట్ సృష్టి వంటి అంశాలపై పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+