ఏపీలో బీసీలకు గుడ్ న్యూస్..! ఉచిత విద్యుత్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి..!
ఏపీలో వెనుకబడిన వర్గాలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని (Free Electricity Scheme) ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి అర్హులైన బీసీ వర్గాలు వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏయే వర్గాలకు ఎంతెంత ఉచిత విద్యుత్ ఉచితంగా అందించనున్నారు, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి వంటి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే ఆయా వర్గాలకు ఉచిత విద్యుత్ ను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏపీలోని బీసీ, ఎంబీసీ వృత్తిదారులకు, పేద కుటుంబాలకు ఉచిత కరెంట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. బీసీ వర్గాల జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. బీసీ వర్గాలకు చెందిన రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఇందులో సెలూన్లకు 200 యూనిట్లు, లాండ్రీ షాపులకు 150 యూనిట్లు, బంగారం షాపులకు 100 యూనిట్లు, తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తారు.

దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ప్రస్తుత కరెంట్ బిల్లు / సర్వీస్ నెంబర్, షాపు సర్టిఫికేట్ తప్పనిసరి. అర్హులైన లబ్దిదారులు సంబంధిత పత్రాలతో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ (AE) కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు మొదలైన 32 ఉప కులాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన వృత్తిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications