టాలెంటెడ్ ఐఏఎస్ లు స్మితాసబర్వాల్, ఆమ్రపాలి కాటా ఇప్పుడు ప్రాధాన్యత కోల్పోవటం వెనుక కారణాలివే
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా స్మితా సబర్వాల్ కు, అమ్రపాలి కాటాకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పోస్టులలో క్రియాశీలకంగా పని చేశారు. ఇద్దరు డైనమిక్ మరియు సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్లుగా సొసైటీలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వార్తలలో కూడా లేకుండా పోయారు.
బ్యూరోక్రాట్ లలో ఆమ్రపాలి కాటా, స్మితా సబర్వాల్ పై చర్చ
ఇది ప్రస్తుతం బ్యూరోక్రాట్ లలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. అసలు ఎందుకు ఈ ఇద్దరినీ ప్రభుత్వాలు సైడ్ చేశాయి? కీలక శాఖల అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు? అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా పని చేసిన ఆమ్రపాలి కాటాను రాష్ట్ర విభజన తర్వాత ఏపీ క్యాడర్ కు కేటాయించడం జరిగింది.

ఏపీలో పర్యాటక శాఖ ఎండీగా ఆమ్రపాలి కాటా.. గత కొన్ని నెలలుగా సెలవుపై
అయితే ఆమె తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయాలని కోరుకోవడం, దానికోసం న్యాయపోరాటం చేసి మరీ విఫలం కావడం, తర్వాత విధిలేని పరిస్థితుల్లో ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి రావడం జరిగింది. ఏపీ పర్యాటక శాఖలో వైస్ చైర్మన్ మరియు ఎండిగా పనిచేసిన ఆమె అక్కడ వాతావరణం తనకు అనుకూలంగా లేకపోవడంతో గత కొన్ని నెలలుగా సెలవులో ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన స్మితా సబర్వాల్
అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమెను పర్యాటక శాఖ నుంచి తొలగించి GADకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆమె పోస్టింగ్ కోసం వెయిటింగ్ స్టేజ్లో ఉంది. ఇక స్మిత సబర్వాల్ విషయానికి వస్తే కెసిఆర్ ప్రభుత్వంలో సీఎంవోలో కీలకపాత్ర పోషించారు. ఆమె జిల్లాల పర్యటనకు కూడా హెలికాప్టర్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కెసిఆర్ ప్రభుత్వం స్మిత సబర్వాల్ కు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెకు ప్రాధాన్యం లేకుండా పోవడానికి కారణమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియా శీలకంగా లేని స్మితా సబర్వాల్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యతను బాగా తగ్గించింది. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఇమేజ్ రీట్వీట్ చేసి పోలీస్ నోటీసులతో పాటు ట్రాన్స్ఫర్ వంటి వివాదాలను కూడా స్మిత సబర్వాల్ ఎదుర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో తనకు ప్రాధాన్యత ఉండబోదని గుర్తించి 2025లో సుదీర్ఘ సెలవు తీసుకున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్నప్పటికీ గతంలోలా క్రియాశీలకపాత్ర ఆమె పోషించడం లేదు.
అప్పట్లో క్రేజీ ఆఫీసర్లకు ఇప్పుడు గడ్డు కాలం
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతతో ఆమె మ్యాచ్ కాకపోవడం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె పనిచేయలేకపోవడం వంటి కారణాలతో స్మిత సబర్వాల్ సైడ్ కావాల్సి వచ్చింది. ఏపీలో ఆమ్రపాలి కాట, తెలంగాణలో స్మితా సబర్వాల్ ఇద్దరు సమర్ధులైన ఐఏఎస్ ఆఫీసర్లుగా బయట సమాజంలో క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ ఉన్న ప్రభుత్వాలతో ఇమడ లేకపోవడం గమనార్హం.



Click it and Unblock the Notifications