అడుగడుగునా ఆంక్షలు- అయినా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు: తగ్గేదే లేదు

మెగా డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.

శ్రీకాకుళం నుంచి పులివెందుల వరకూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ర్యాలీలు కొనసాగాయి. వాటికి పలు చోట్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పార్టీ నాయకులకు నోటీసులను జారీ చేశారు. ర్యాలీలకు వస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గట్లేదని అన్నారు.

YSRCP Protest Rallies In Andhra Pradesh Restricted by Police Over Mega DSC demands for a CBI inquiry

విశాఖపట్నంలో ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలకు రావద్దంటూ పార్టీ శ్రేణులకు తెలియజేశారు. దీంతోపాటు నిరసన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజువాకలో ర్యాలీకి బయలుదేరిన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవన్‌రెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలకు వైసీపీ సిద్ధం కాగా.. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

బంగారం ధరల్లో మిక్స్డ్ ట్రెండ్- అవి పైపైకి.. ఇవి భారీగా డౌన్
బంగారం ధరల్లో మిక్స్డ్ ట్రెండ్- అవి పైపైకి.. ఇవి భారీగా డౌన్

మాజీ ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. కాకినాడ జిల్లా తునిలోనూ ర్యాలీకి అనుమతి లేదంటూ పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చారు. సెక్షన్‌ 30 అమల్లో ఉందని తెలిపారు. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చిన పోలీసులు, ర్యాలీ నిర్వహిస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్
అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి స్వగృహం నుంచి బయటకు వస్తుండగా పోలీసులు నిలువరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రికి వస్తున్న పార్టీ శ్రేణుల వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.

100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్
100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్

పులివెందులలో లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. పూల అంగళ్ల నుంచి ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కర్నూలులోనూ వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అర్థరాత్రే నోటీసులు అందజేశారని, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+