EXAM review :నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో గుండెల్ని పిండేసే ఎమోషనల్ థ్రిల్లర్!

  • నటీనటులు: దుషారా విజయన్, అదితి బాలన్, అబ్బాస్, వసుంధర కాశ్యప్
  • దర్శకత్వం: ఎ. సర్కుణమ్
  • భాష: తమిళ్ (తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది)

భారతదేశంలో 'పరీక్ష' అనే మాట వింటేనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. చిన్నప్పటి నుంచే ఒక పేపర్ ముక్క మన జీవిత భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని మనల్ని నమ్మిస్తారు. అలాంటిది, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన(NEET) లాంటి ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్ అయితే? లక్షలాది మంది విద్యార్థుల కష్టం, వారి తల్లిదండ్రుల ఆశలు, గౌరవం ఒక్క రాత్రిలో బూడిదలో పోసిన పన్నీరైతే ఆ ఆవేదన ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే సమకాలీన అంశాన్ని, వ్యవస్థలోని కుళ్లును కళ్లకు కడుతూ తెరకెక్కిన వెబ్ సిరీస్ే ఈ 'ఎగ్జామ్'.

అసలు కథేంటంటే?

"ఎగ్జామ్ "ఈ తమిళ థ్రిల్లర్ సిరీస్ ఒక ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలవుతుంది. దేశంలో జరుగుతున్న ఒక పెద్ద ఎగ్జామ్ స్కామ్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఝాన్సీ (దుషారా విజయన్) అనే ఒక సాధారణ మహిళ రంగంలోకి దిగుతుంది.ఇందుకోసం ఆమె ఏకంగా ఒక డీఎస్‌పీ ఆఫీసర్ (అదితి బాలన్) ఐడెంటిటీని (గుర్తింపును) దొంగిలించి పోలీస్ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది.పరీక్షా పత్రాల లీకేజీ, కోచింగ్ సెంటర్ల మాఫియా,రాజకీయ నాయకుల అండదండలతో సాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌ను ఆమె ఎలా బట్టబయలు చేసింది?ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేదే ఈ సిరీస్ కథ.

exam-review-a-hard-hitting-emotional-thriller-that-connects-common-man-amid-the-neet-exam-paper-leak

దుషారా విజయన్ వన్-ఉమెన్ షో!

"ఎగ్జామ్ " సిరీస్‌కు అతిపెద్ద బలం దుషారా విజయన్ నటన.ఝాన్సీ పాత్రలో ఆమె జీవించేసింది.వ్యవస్థపై ఆమె కళ్లలో కనిపించే కోపం,అదే సమయంలో సామాన్యురాలిగా ఆమె పడే ఆవేదన, భయం ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి.ఎక్కడా అతిగా ప్రవర్తించకుండా,ఎమోషన్స్‌ను చాలా కంట్రోల్‌గా పలికించి మెప్పించింది.డీఎస్‌పీగా అదితి బాలన్ తనదైన శైలిలో ఆకట్టుకోగా,సీనియర్ నటుడు అబ్బాస్ కథకు కావలసినంత హుందాతనాన్ని,నమ్మకాన్ని తీసుకొచ్చారు.

ప్రపంచంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ
ప్రపంచంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ

సమకాలీన సత్యం.. గుండెల్ని పిండేసే ఎమోషన్ ఈ మధ్యకాలంలో పేపర్ లీకేజీలు,నీట్ (NEET) పరీక్షల చుట్టూ జరుగుతున్న వివాదాల గురించి మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.అందుకే ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఇది ఎక్కడో జరిగిన కథలా అనిపించదు,మన కళ్లముందు జరుగుతున్న నిజంలా అనిపించి భయపెడుతుంది.కోచింగ్ సెంటర్లు,లంచాలు,సిస్టమ్‌ను ఎలా మ్యానిపులేట్ చేస్తారు అనే విషయాలను దర్శకుడు చాలా డీటెయిల్‌గా చూపించారు.మెరిట్ ఉన్న విద్యార్థులను ఈ వ్యవస్థ ఎలా మోసం చేస్తుందో చూపించినప్పుడు ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది.

చిన్న లోపాలు..

కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కథాంశం చాలా బలంగా ఉన్నప్పటికీ,కొన్ని ఎపిసోడ్‌లలో సాగదీతగా అనిపిస్తుంది.కొన్ని ట్విస్టులు మనం ముందే ఊహించేలా ఉంటాయి.ఇదొక హార్డ్-హిట్టింగ్ సోషల్ మెసేజ్ ఉన్న సిరీస్ లాగా సాగుతూనే,మధ్య మధ్యలో కమర్షియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా మారిపోతుంది.ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కాస్త తప్పినట్లు అనిపించినా,కథలోని వేగం ఆ లోపాలను కప్పేస్తుంది.

'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి రివ్యూ: ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఉంటుంది..!
'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి రివ్యూ: ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఉంటుంది..!

'ఎగ్జామ్' థ్రిల్లర్ జోనర్‌లో ఒక కొత్త చరిత్రను సృష్టించకపోవచ్చు, కానీ ఇది చెప్పిన పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం.ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు,మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యా మాఫియాపై సామాన్యుడి గర్జన.ముఖ్యంగా విద్యార్థులు,తల్లిదండ్రులు,బాధ్యతగల పౌరులు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.ఎందుకంటే,ఇందులో చూపించిన భయం.. ప్రతి భారతీయుడికి బాగా తెలిసిన భయం.

రేటింగ్ : 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+