హేవలంబి నామ సంవత్సరం: వృశ్చిక రాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

ఆదాయం - 8 వ్యయం -14 రాజ్యపూజ్యం - 4 అవమానం - 5

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఇది మీకు మంచి కాలము. ఈ సమయములో ఉద్యోగములో ఉన్నత పదవి, వ్యాపారములో లాభము, ఉన్నత స్థాయి లభిస్తాయి. సంఘములో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సమయము, శారీరకముగా, మానసికముగా చక్కగా ఉండి, అందరు మిమ్మల్ని గుర్తించే విధముగా ప్రవర్తిస్తారు. స్నేహితుల నుండి, అయిన వారి నుండి లాభము, శత్రు నాశనము కలుగును. దైవ కార్యముల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఎల్లప్పుడు దైవ చింతన చేయుట వలన శక్తి లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహము, వివాహితులకు సంతాన యోగ్యము, కొందరికి అన్యస్త్రీతో శృంగారము సంభవించును. ఆర్ధికముగా బాగుండి, స్థలము, ఆభరణాలు, వాహనాలు, వస్తువుల కొనుగోలు, విలాసవంతమైన జీవితము గడుపుదురు. ఆరోగ్య లాభము మరియు శాంతిగా ఉండుట జరుగవచ్చును.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ దశలో ఖర్చులు చేయుదురు. ధన వ్యయము ఎక్కువగా చేస్తారు. వ్యాపారాలు చేయుట కష్టతరము, ముఖ్యముగా పశువులు పాలించే వారి వ్యాపారములో కష్టాలు ఎక్కువ. అయితే కొందరు పుణ్య కార్యములు, శుభకార్యములకు ధనము ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయములో స్వగ్రామమునకు, సంతానానికి దూరముగా ఉండి గడపవలసి వస్తుంది. ఉద్యోగములో ఉన్న వారు పని యందు జాగ్రత్తగా ఉండుట అవసరము, లేదా ఉద్యోమునకు నష్టము వాటిల్లే ప్రమాదము ఉంది. ఈ సమయములో మీరు వింతగా ప్రవర్తిస్తారు. మానసికముగా, శారీరకముగా అనారోగ్యము, తెలియని బాధ, భయముతో గడుపుతారు. ప్రాణానికి ම హాని తెచ్చే ఏ పని చేయరాదు. అయిన వారితోను, అందరితోను మీరు చెడ్డగా వ్యవహరిస్తారు. సంఘములోని వారు మీకు ఎదురు తిరుగుతారు. అపకీర్తి సంభవిస్తుంది. చెడు పనులకు దూరముగా ఉండగలరు. కొందరికి ధన లాభము, తద్వారా వాహన కొనుగోలు సంభవించవచ్చును.

The Raasi Phalas of Hevalambi vruchikarasi

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రగమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఇది ఒక గడుకాలము, అనుకున్న పనిలో ఆటంకాలు, ఆశించిన ఫలితాలు దక్కవు. మీరు ఉద్యోగములో ఉన్నటైతే ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికముగా ఈ కాలము మంచిది కాదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ధనాదాయములో అనేక రకములుగా చేతికి వచ్చి, మరుక్షణము మాయమగును. పితృ ఆస్థి గురించి అనవసర వాదనలకు దిగరాదు. దీని వలన మీ గౌరవమునకు ఆనందమునకు భంగము కలుగును.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, కష్టకాలము, ధనవ్యయము, అనవసరమైన ఖర్చులు, అనవసర ఋణములు చేయరాదు. నిదాశావాదిగా వ్యవహరిస్తారు. ఏ పని తలపెట్టినా అడ్డకులు ఎదురగును. కొందరు జైలుకు కూడా వెళ్లవలసి వచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. ప్రమాదాలకు, రోగములకు గురి కాగలరు. బహు జాగ్రతమతగా ఉండుటకు ప్రయత్నించగలరు. జీవిత భాగస్వామి ఆరోగ్యము కూడా మందగించును. శిరోవేదన, శక్తి తగును, ఉత్సాహము నశించును, మనశ్శాంతి ఉండదు. వృత్తి వ్యవహారములలో ఇబ్బందులు, వృత్తి వ్యవహారములలో జాగ్రత్తగా మసలుకొనవలెను.

ప్రయాణములు సంభవించును. బహుదూర ప్రయాణములు చేయవలసి ఉండవచ్చును. వేరే దేశమునకు/ప్రాంతమునకు బదిలీలు కలుగవచ్చును, అందువలన అయిన వారికి, అందరికి దూరముగా ఉండవలసి వచ్చి, కష్టముగా ఉండవచ్చును. గృహమునందు శాంతిగా వ్యవహరించాలి. గృహములో సోదర వర్గముతో వాదనలకు దిగుతారు, దాని వలన భార్యా, పుత్రులకు ఇబ్బందులు కలుగవచ్చును. కావున, గృహ కలహముల నుండి భార్యా, పుత్రులను దూరముగా ఉంచాలి. మరణ వార్తలు విందురు. బంధు వర్గము వారి మరణము సంభవించును. అందరికి దూరముగా ఉండుట వలన విలువైన స్నేహితులు దూరమగుదురు. ఈ కాలవలో చాలా జాగ్రత్తగా మసలు కొనవలెను, లేనిచో కష్టముల పాలగుదురు.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. ఈ దశలో అనవసర వాగ్వివాదములకు దిగి, కొత్త శత్రువులను సంపాదిస్తారు. మీలో కొందరి మనస్తత్వము చెడు వైపు మళుతుంది. మీ గృహములోనే శత్రుత్వము పెరుగును. అనవసరముగా జీవిత భాగస్వామిని బాధించరాదు. సంతానమును చక్కగా చూసుకొనవలెను. ఈ దశలో ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. నీరసము, నిరుత్సాహము కలుగును. చిన్న పని చేసినను తొందరగా అలసి పోవుదురు. కొందరు వేరే దేశములు వెళ్ల వలసి వచ్చును. అది మీకు ఆశ్చర్యమును కలిగించును.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, ఈ దశ మిశ్రమ ఫలితములను ఇచ్చును. మొదటి భాగము మంచి కాలము, మిగతా తర్వాత భాగము చెడు ఫలితములను ఇచ్చును. మీ వృత్తి వ్యవహారములలో ధనార్థన, పై అధికారులతో మంచిగా ఉన్నందు వలన వారి సహకారము లభిస్తుంది. తద్వారా మరిన్ని బాధ్యతలుపెరుగుతాయి. హక్కులు వచ్చిన సొమ్ముపై శ్రద్ధ చూపవలెను లేనిచో నష్టము సంభవించవచ్చును. కేతువు చతుర్ధమునందు ప్రవేశము:- ఈ కాలములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యసిద్ధి కొరకు ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఆర్ధిక పరముగా అంతగా కలసి వచ్చే దశకాదు. ఎక్కువ మొత్తములో ఋణములు చేయరాదు. విరోధములకు దూరముగా ఉండుట మంచిది. అలాగే స్థిరాస్థి విషయములో జాగ్రత్త అవసరము, లేదా దానిని కోల్పోదురు. ఆరోగ్యభంగము, ఆరోగ్యముపై తగినంత శ్రద్ధ చూపవలెను. వేడిగా దూరముగా ఉండగలరు. నిరుత్సాహము, అలసటగా ఉందురు.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ధన నష్టము, చెడ్డపనులు చేయుదురు. కష్టించి గడించిన సొమ్మును లాటరీలకు వినియోగించి, తద్వారా నష్టపోవుదురు. ధన వ్యయము జాగ్రత్తపడనిచో కష్టకాలము చవి చూచెదరు. జాతి విరుద్దమైన పనులు చేయుదురు, చేతబడులు చేసే అవకాశము ఉండవచ్చును. వృత్తి వ్యవహారములలో ఒడిదుడుకులు మరియు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చును. సోదర వర్గముతో వాదోపవాదములు పనికిరావు.

కేతువు తృతీయమునందు ప్రవేశము:- ఈ దశ మీకు ఆనందమును, ధనలాభమును కలిగించును. ఇంతవరకు అవ్వని పనులు పూర్తవుతాయి. కార్యసిద్ధి, అనుకున్న పనులు నెరవేరి, ఆశించిన ఫలితములు దక్కును. వృత్తి వ్యవహారములలో, సంఘములో వేరేవారికి ఆదర్శవంతులు అగుదురు. సనులలో తోటి పనివారి సహకారము పొందగలరు. కాని, పనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరము. మంచిపేరు తెచ్చే కాలము. విధ్యారులకు మంచి కాలము. మీలో కొంతమంది గణిత శాస్త్రమును చక్కగా అభ్యసించగలరు.

ధను రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...