2018 సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి "బిజినెస్(వ్యాపార)"ఫలితాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

గమనిక:- ఈ ద్వాదశ రాశుల వారికి "బిజినెస్(వ్యాపార)" ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. "బిజినెస్(వ్యాపార)" సంబంధించి అంశాలు వ్యక్తిగత జాతకంలో 2,6,10, స్థానాలను మరియు బుధుగ్రహం యొక్క స్థితి ద్వారా వ్యక్తి ఉద్యోగ జీవితం గురించి తెలియ జేసే స్థానాలు ఈ స్థానాలు బాగుంటే ఉద్యోగ జీవితం బాగుంటుంది.వ్యాపారానికి బుధుడు కారకుడు అవుతాడు.3,7,11 స్థానాలు బాగుంటే మంచి బిజినేస్ మెన్ అవుతాడు.

ఆరవ స్థానం వృత్తికి,ఉద్యోగానికి కారకత్వం వహిస్తుంది.స్వదేశి,విదేశి వ్యాపార/ఉద్యోగాల కోరకు శ్రమకు తగ్గ లాభం ఉందా అనే అంశం కోరకు1, 2,6,10,11 భావాల కారకత్వాలను పరిశీలించాల్సి ఉంటుంది.మరియు నక్షత్రం,రాశి,లగ్నం ద్వార అసలు మీరు చేస్తున్న బిజినెస్ ఎంతవరకు లాభదాయమో పరిశీలంచాల్సి ఉంటుంది మీ జాతకంలో సప్తమ స్థానము నుండి వ్యయస్థానం వరకు గ్రహల స్థితి,జాతక చక్రంలో ఐదు లేదా అంతకన్న ఎక్కువ గ్రహాలు, సప్తమ స్థానము నుండి వ్యయ స్థానం వరకు లేదా దశమ స్థానము నుండి తృతీయస్థానం వరకు ఉంటే ఆ వ్యక్తి స్వయం ఉపాధి వృత్తిని ఎంచుకుంటాడు.

లగ్నం,లగ్నాధిపతి,దశమం,దశమాధిపతి,అమాత్యకారకులతో 6,8,12ల అధిపతులతో సంబంధం ఉంటే 6,8,12 అధిపతులకు సంబంధించిన దశ,అంతర్ధశల,ప్రత్యంతర్ధశలలో,మహాదశ,అంతర్ధశ,ప్రత్యంతర్ధశ గ్రహలు,గ్రహ యుద్ధంలో అస్తంగత్వం పొందిన,వక్రీంచిన,మృత్యుభాగంలోఉన్న,దశా ఛిద్రం(మహదశ ప్రారంభ,అంతర్ధశ)లలో చేసే బిజినెస్ పరంగా కష్టాలు,నష్టాలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారు.మరియు ఇతర ముఖ్య గ్రహాల స్థానాలు,వారి యుతులు,పరివర్తన స్థితి, దృష్టులు,ఉచ్చ,నీచ స్థానాలు,ప్రస్తుతం నడుస్తున్న మహర్ధశ,అంతర్దశ,అష్టక వర్గు బిందువులు,నవాంశ గ్రహా స్థితులతో పాటు ముఖ్యంగా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుని "బిజినెస్(వ్యాపార)"కు సంబంధించిన ఫలితాలను నిర్ణయించాల్సి ఉంటుంది.

 2018 predictions: Business horoscope for the year 2018

కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ వ్యక్తిగత జాతకపరిశీలతో పూర్తి "బిజినెస్(వ్యాపార)"వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి వారికి 2018 సంవత్సరంలో "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు :- అష్టమ స్థానంలో గురు గ్రహ సంచారం,శని తొమ్మిదవ ఇంట్లో,సప్తమ,దశమంలో కేతువు,నాలుగవ ఇంట రాహూవు సంచారం వలన వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.మీరు చేసే కృషికి అభివృద్ది కనబడుతుంది.కొంత ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికిని నిధానంగా సమస్యలు సమసిపోతాయి. నూతనంగా పరిచయం అయిన వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయ కూడదు.

వృషభరాశి వారికి 2018 సంవత్సరంలో "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:-షష్టమ సప్తమ స్థానాలలో గురు గ్రహా సంచారం,అష్టమంలో శని సంచారం తొమ్మిదవ ఇంట కేతువు,మూడవ ఇంట్లో రాహువు సంచారం వలన మీ బిజినెస్ పోటి తత్వం ఎక్కువగా ఉంటుంది.మీ బిజినెస్ ను దెబ్బతీయలని రహస్య శత్రువులు ఎదురు చూస్తుంటారు,తగు జాగ్రత్తలు పాటించాలి.కొంత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికిని మనోధ్యైర్యం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.బిజినెస్ అభివృద్ధి చేయుటకోరకు ఋణాలు చేస్తారు.ధన నష్టం జరగకుండా మీ వ్యక్తిగత శద్ధ చూపాల్సి వస్తుంది.రియల్ ఎస్టేట్,స్థిరాస్తులకు,భూ సంబంధిత వ్యవహారాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.తిరిగి చేసే వ్యాయపారాలు,మార్కేటింగ్ మొదలగు వాటిలో మంచి ఫలితాలు ఉంటాయి.

మిధునరాశి వారికి 2018 సంవత్సరంలో "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- సప్తమంలో శని గ్రహం,అష్టమంలో కేతువు,ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురు గ్రహ సంచారం వలన మీ వ్యాపార విస్తరించడం కొరకు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ లో మీరు బాగా సంపాదిస్తారు.వ్యాపార సంబంధమైన ఖర్చులు మార్చిలో ఎక్కువగా ఉండేఅవకాశం ఉంది.ఈ ఏడాది వ్యాపారాలు గతం కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ కోరకు గతంలో మీరు పడ్డ కష్టం భవిష్యత్తు అభివృద్ధికి పునాదిగా నిలుస్తుంది. మొత్తం మీద ఈ ఏడాది బిజినెస్ పరంగా ఎదగడానికి అనేక సదా అవకాశాలను కనిపిస్తున్నాయి.అక్టోబర్ నుండి మీ బిజినెస్ కు పోటి,ఈర్ష్య మొదలగునవి ఉంటాయి జాగ్రత్త పడండి.

కర్కాటక వారికి 2018 సంవత్సరంలో "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- షష్టమంలో శని,చతుర్ధ పంచమాలలో గురువు,లగ్నంలో రాహువు,సప్తమంలో కేతుగ్రహ సంచారం వలన బిజినెస్ లో మీ వ్యాపారనిపుణత వలన మీ పేరు ప్రఖ్యాతులు మరియు స్థాయి పెరుగుతుంది. మీ సామాజిక స్థితి కూడా పెరుగుతుంది.వ్యాపారాలు అనుకూలించి సంపాదన లాభసాటిగా ఉంటుంది.మీరు మీ బిజినెస్ ఎలా అభివృద్ధి చేయాలనుకున్నారో అదే విధంగా అభివృద్ధి ఉంటుంది.సమాజంలో మీ నిపుణతకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అక్టోబర్ నుండి మార్చి వరకు మీ వ్యాపారాలను దెబ్బతీయాలనే శత్రువులు అధికం అవుతారు,భాగసామ్య వ్యాపారాలలో జాగ్రత్తలు వహించండి.విదేశి ఎగుమతి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

సింహరాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- పంచమంలో శనిగ్రహం,త్రుతీయ చతుర్ధ స్థానలలో గురువు,షష్టమంలో కేతువు,వ్యయంలో రాహుగ్రహ సంచారం వలన మీ వ్యాపరం కోరకు చేసే నిరంతర శ్రమకు మిమ్మల్ని విజయపథంవైపుకు నడిపిస్తాయి.బిజినెస్ పరంగా విదేశీ ప్రయణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్ నెలలో వృత్తిపరమైన సానుకూలమైన మార్పులను మీరు చూడవచ్చు.మీ బిజినెస్ ప్రజాఆధరణ పొందుతుంది.బిజినెస్ డేవలప్ మెంటు కొరకు అధిక ధన వ్యయాలు, కొన్నివృదా ఖర్చులు ఉంటాయి. మొత్తానికి పట్టుదలతో కార్యక్రమాలను నెరవేర్చు కుంటారు.

కన్యారాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- చతుర్ధ స్థానంలో శనిగ్రహం,ద్వితీయ త్రుతీయ స్థానంలో గురువు,పంచమంలోకేతువు,ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన బిజినెస్ పరంగా ఈ ఏడాది మీరు అత్యుత్తమ విజయాలను సాధిస్తారు. అపారమైన అవకాశాల ద్వారా మీరు చక్కటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సామాజిక సంబంధాలు చాలా అధికంగా ఉంటాయి.వ్యాపార సామాజిక స్థితిలో కూడా మెరుగుదల ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ దీర్ఘకాలిక వ్యాపార అభివృద్ధి కోరిక నెరవేరతాయి. సంవత్సరం అంతటా కూడా ఆదాయ ప్రవాహం చక్కగా ఉంటుంది. అక్టోబర్ తరువాత మరింత పెరుగుతుంది.భాగస్వామి ద్వారా మీరు లబ్ధిని పొందే అవకాశం ఉంది. అక్టోబర్ వరకు లాభాలు మధ్యస్తంగా ఉంటాయి.

తులారాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- తృతీయంలో శని గ్రహం,లగ్న ద్వితీయంలో గురు గ్రహం,చతుర్ధంలో కేతువు,దశమంలో రాహు గ్రహ సంచారం వలన మీ బిజినెస్ సంవత్సర ప్రారంభంలోనే ఆర్భాటం అనుకూలంగా సాగుతాయి. బిజినెస్ లో ఎవరితోనైన మాట్లాడేముందు జాగ్రత్త వహించండి.మీ వ్యాపార ఆలోచనలకు చక్కటి అభివృద్ధి కనపడుతుంది.బిజినెస్ విషయాలను మీకు అనుకూలంగ నిర్వహించుకోగలుగుతారు.భాగసామ్య వ్యాపారాలలో బద్ధకాన్ని దూరం చేసుకోవాలి. జనవరి- మార్చి మధ్య సంపాదన పెరిగే అవకాశాలున్నయి.కొత్త ఆలోచనలు వ్యాపార అభివృద్ధి వేదిక వైపు నడిపిస్తుంది. వ్యాపార భాగసామ్య స్నేహితులతో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. మీరు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలి.మొత్తం మీద ఈ సంవత్సరం మీకు ఒక పురోగాభివృద్ధి సంవత్సరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- ద్వితీయంలో శని గ్రహం,వ్యయంలో గురు గ్రహం,తృతీయంలో కేతువు, తొమ్మిదవ ఇంట్లో రాహుగ్రహ సంచారం వలన వ్యాపార ఆర్ధిక,పోటి సవాళ్లను ఎదుర్కొంటారు. వాటిని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే విజయాలను సాధించగలుగుతారు.బిజినెస్ సామర్థ్యాన్ని పొందుతారు. ప్రత్యర్థులపై ఆధిపత్యంతో నిలుస్తారు. ఆర్థిక విషయాలలో ఈ ఏడాది అక్టోబర్ వరకు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ ఆర్థిక విషయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అక్టోబర్ తర్వాత సమర్థవంతంగా మంచి ఫలితాలు కనబడుతాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు మరోసారి ఆలోచించండి. ఈ ఏడాది మీరు మీ యొక్క అన్ని బంధాలను పక్కకు పెట్టి ఆదాయం పొందే దిశగా పనిచేస్తారు.

ధనుస్సు వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- లగ్నంలో శని గ్రహం,ఏకాదశ,వ్యయస్థానలలో గురు గ్రహం,ద్వితీయంలో కేతువు,అష్టమంలో రాహుగ్రహ సంచారం వలన బిజినెస్ పరంగా ఎదగడం కొరకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి.ఒక ఖచ్చితమైన సంవత్సరంగా తీర్చిదిద్దుకోవడం కొరకు మీ యొక్క అంకితభావం ఎక్కువగా ఉంటుంది. మార్చి వరకు ఆదాయ అనుకూలంగా పెరుగుతుంది. మే చివర వరకు ఖర్చులు పెరుగుతాయి.మిగిలిన సంవత్సరం అంతా కూడా సరైన మార్గంలో సాగుతుంది. అందువల్ల ఆర్ధిక పరంగా ఆందోళన చెందకూడదు. మీ యొక్క ప్రతిభ వలన ఆదాయ మార్గాలు పెరుగుతాయి,అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. వ్యాపారంలో నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు, భాగసామ్య మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

మకరరాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- వ్యయస్థానంలో శనిగ్రహం,దశమ,ఏకాదశంలో గురుగ్రహం,సప్తమంలో రాహువు,లగ్నంలో కేతుగ్రహ సంచారం వలన బిజినెస్ లో అభివృద్ది కోరకు చేసే ఆడ్స్,అడ్వటైజింగ్ లకు మరియు ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.మరోవైపు ఆదాయం తగ్గిపోతున్న భావన మీకు కలుగుతుంది.మీ బిజినెస్ కు కొన్ని విదేశీ సంబంధాలను పొందుతారు,దాని ద్వార సంపాదన మరియు ఆదాయం పెరుగుతుంది.మీ సూక్ష్మబుద్ధితో వ్యాపారాలలో విజయాలను సాధిస్తారు.మీ వ్యాపార దక్షతకు గుర్తింపు వస్తుంది.

కుంభరాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- ఏకాదశ స్థానంలో శని గ్రహం,నవమ-దశమ స్థానంలో గురువు,షష్టమ స్థానంలో రాహువు,వ్యయ స్థానంలో కేతు గ్రహ సంచారం వలన బిజినెస్ లో మంచి నిర్ణయాలు తీసుకునేవి పురోగతికి పునాది వేసుకుంటారు.కష్టపడి పనిచేయడం వల్ల మీ ప్రధాన దృష్టి సంపదపై ఉంటుంది.ఈ సంవత్సరం ఒక లాభదాయక సంవత్సరంగా రూపొందించుకుంటారు. వ్యాపార ఆర్థిక స్థితి మెరుగవుతుంది.బిజినెస్ ల కొరకు సుదూర ప్రయాణాలు చేపడతారు. వ్యాపారానికి సంబంధించిన తెలివైన మరియు వివైన నిర్ణయాలు తీసుకుంటారు.మీ బిజినెస్ లో అభివృద్ధిని చూడాలంటే సహనం పాటించక తప్పదు.మొత్తానికి ఈ ఏడాది అన్ని వ్యాపార కార్యక్రమలలో విజయాలను ,పేరు ప్రతిష్టతను సాదిస్తారు.

మీనరాశి వారికి 2018 సంవత్సర "బిజినెస్(వ్యాపార)" ఫలితాలు:- దశమస్థానంలో శనిగ్రహం,అష్టమ,నవమ స్థానంలో గురువు,ఏకాదశ స్థానంలో కేతువు,పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన భూ ,రియల్ ఏస్టేట్ నకు సంబందించిన వాటిలో అనుకూలంగా ఉంటుంది.బిజినెస్ దేవలప్మెంట్ కొరకు సహనతో వ్యవహరించాలి.ఎక్కువ ఒత్తిడితో పనిచేయడం వల్ల మీకు సమస్యలు కలగవచ్చు. వ్యాపారంలో అనుకున్న ఫలితాలను పొందడం కొరకు మీరు అదనంగా శ్రమించాల్సి ఉంటుంది.జనవరి లో ఆర్థికపరంగా మీకు సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఆ తర్వాత మీ ఆదాయం మరింత పెరుగుతుంది.వ్యాపార పరమైన బాధ్యతల వల్ల మీరు నివాసాన్ని మార్చుకునే అవకాశంఉన్నది.అక్టోబర్ తరువాత మీ జీవితంలో మరింత సానుకూల మార్పులను చూడవచ్చు.

--------------

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer Acharya predicted the business horoscope for the year 2018

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి