ఆ వెదవల పనే.. రామ్ చరణ్‌కి అండగా జగ్గుభాయ్ !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం "పెద్ది". ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ఎమోషన్స్‌ను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్రబృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. రామ్ చరణ్‌తో పాటు యూనిట్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది. కాగా ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో సీనియర్ నటుడు జగపతి బాబు అప్పల సూరి అనే కీలక, వయసు మళ్లిన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగ్గూభాయ్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలతో పాటు రామ్ చరణ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు.

actor-jagapathi-babu-support-to-ram-charan-over-peddi-movie-negative-trollings-on-social-media

'పెద్ది'లో తన అప్పల సూరి పాత్ర గురించి జగపతి బాబు మాట్లాడుతూ.. "లెజెండ్ తర్వాత 100 సినిమాలు చేసినా 5-6 పాత్రలు మాత్రమే గుర్తుంటాయి. 'పెద్ది'లోని అప్పలసూరి పాత్ర వాటిలో ఒకటి. సినిమా విడుదలయ్యాక ఇది కచ్చితంగా అగ్రస్థానాన్ని దక్కించుకోవచ్చు" అని ధీమా వ్యక్తం చేశారు. అలానే రామ్ చరణ్‌పై ట్రోల్స్‌కు స్పందిస్తూ జగపతిబాబు, ట్రోల్ చేసే వారిని "పనిలేని వెధవలు"గా అభివర్ణించారు. "గుంటకాడ నక్కల్లాంటి వాళ్లు... పని ఉండదు కాబట్టి, ఎవరిని కిందకు లాగుదామా అని చూస్తుంటారు" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

మరీ ముఖ్యంగా 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎంతో కృషి చేసి, పలు గాయాలపాలయ్యారని జగపతి బాబు గుర్తు చేశారు. ఈవెంట్‌లు, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కాల్స్, థియేటర్ల సమస్యలతో హీరోకు ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని వివరించారు. ఈ హడావిడిలో విషయాలు మర్చిపోవడం సహజమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తరహా వాటి వల్ల రామ్ చరణ్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదని, ట్రోల్స్ కొద్దిరోజులు మాట్లాడి ఆగిపోతాయని స్పష్టం చేశారు. గతంలో తనను 70-80 టేక్‌లు తీసుకున్నారని ట్రోల్ చేయగా, అది అబద్ధమని కొట్టిపారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+