పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ లో చీలిక
కోల్ కతా: పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ కు మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఏఐసిసి సభ్యులు కాంగ్రెస్ కు ఆదివారం గుడ్ బై చెప్పారు. మమతాబెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. పశ్చిమబెంగాల్ పిసిసి ఉపాధ్యక్షుడు సౌగతారాయ్ తో పాటు 8 మంది ఎమ్మేల్యేలు తృణమూల్ పార్టీలో చేరుతున్నట్లు కోల్ కోతాలో ప్రకటించారు. కాంగ్రెస్ సమైక్య సదస్సు పేరిట ఏర్పాటు చేసిన సభలో వారు ప్రకటించారు. ఈ సభకు తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు.
మార్క్సిస్ట్ లతో కాంగ్రెస్ అధిష్టానం చేతులు కలుపుతోంది. అందుకే కమ్యూనిస్ట్ లను ఓడగట్టే శక్తి ఉన్న ఏకైక పార్టీ తృణమూల్ లో చేరాలని నిర్ణయించుకున్నామని సౌగతా రాయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications