వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాల్కో బాటలోనే ఐపిసిఎల్?
న్యూఢిల్లీ: బాల్కో వివాదం సమసిపోక ముందే మరో ప్రభుత్వ రంగసంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రప్రభుత్వంశ్రీకారం చుడుతోంది. ఇండియన్ పెట్రోలియం కార్పోరేషన్ ( ఐపిసిఎల్ ) లో మార్చి 31లోగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాలను పూర్తిచేసేందుకు సిద్ధమవుతోంది. ఐపిసిఎల్ కు చెందిన బరోడా యూనిట్ ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కుఅమ్మివేయాలని ఐపిసిఎల్ భావిస్తోంది.
డిజిన్వెస్ట్ మెంట్ శాఖ అనుమతి కోసం ఇరు కంపెనీల ఉన్నతాధికారులు సంప్రతింపులు జరుపుతున్నారు. అయితే బాల్కో మాదిరిగావివాదానికి దారితీసే అవకాశం లేదని ఆ ఉన్నతాధికారులుఅంటున్నారు. ఒక ప్రభుత్వరంగ సంస్థకు చెందినఎస్సెట్స్ మరో సంస్థకు అప్పగించడమే కాబట్టి ఇందులో రగడకు ఆస్కారమే లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!