కాశ్మీర్ లో 4గురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా ప్రాంతంలోని సైనిక శిబిరంపై ఆదివారం లష్కరే తోయిబా తీవ్రవాదులు దాడిచేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు కూడా మరణించారు. ఆదివారం తెల్లవారుఝూమున 4 గంటలకు తీవ్రవాదులు జమ్మూకాశ్మీర్ లైట్ ఇన్ ఫాంట్రీ శిబిరంలోకి జొరబడ్డారు. శిబిరం చుట్టు ఉన్న కంచెను కత్తిరించి లోపలికి జొరబడ్డ తీవ్రవాదులు గ్రెనెడ్లు విసురుతూ సైనికులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. నలుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. అనంతరం సైనికులు ఎదురు కాల్పలు జరపడంతో తీవ్రవాదులు పారిపోయారు. ఇద్దరు తీవ్రవాదులకు మాత్రం బుల్లెట్లు తగలడంతో మరణించారు.












Click it and Unblock the Notifications