గుజరాత్ లో మళ్ళీస్వల్ప భూకంపం
అహ్మదాబాద్: గుజరాత్ లో ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ స్వల్పంగా భూమి కంపించింది. అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదు. భారీ భూకంపం నుంచి ఇంకా తేరుకోని గుజరాత్ ప్రజలు మళ్ళీ భూమి కంపించడంతో రోడ్లపై పరుగులు తీశారు. భయంతో ఇళ్ళ నుంచి బయటికి వచ్చారు. ఎప్పుడు భూకంపం వస్తుందోనన్న భయంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications