మహబూబ్‌ నగర్‌ లో 10మంది మృతి

మహబూబ్‌ నగర్‌ః మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు.వీరంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సభకుహాజరై తిరిగి వస్తున్న బిజెపి కార్యకర్తల జీపు ఎదురుగా వస్తున్న లారీని డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

అడ్డాకుల మండలం శాఖాపూర్‌ వద్ద మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా వున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరణించిన వారంతా మల్డకల్‌ మండలం మల్లెందొడ్డి, కుర్తివావుల చెరువు, మద్దెల తండా వాసులు. ఈ దుర్ఘటన పట్ల బిజెపి రాష్ట్ర శాఖ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+