విదేశాంగప్రతినిధిగా అనుపమారావు! Home Full Story
న్యూఢిల్లీః భారతవిదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా తొలిసారిగా నిరుపమారావు అనేమహిళ నియమితులు కానున్నారు. ఈమె నియామకాన్ని ఇంకాఅధికారికంగా ధృవీకరించవలసి ఉంది. 1973 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ కి చెందిన నిరుపమారావు ప్రస్తుతంవిదేశాంగ శాఖలో జాయింట్ సెక్రెటరీగాపనిచేస్తున్నారు. మొదటి మహిళా విదేశాగకార్యదర్శిగా చోకిలా అయ్యర్ నియమితులైన కొన్నివారాలకే ఈ శాఖలో తొలి మహిళా అధికార ప్రతినిధినియమితులు కాబోవడం విశేషం.
ఇప్పటి వరకు విదేశాంగ శాఖ అధికారప్రతినిధిగా ఉన్న రామీందర్ సింగ్ జస్సాల్‌ఇజ్రాయెల్ రాయబారిగా వెళ్ళబోతున్నారు. మహిళలకు సమానావకాశాలు కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడిఉందని ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలియజెప్పేందుకేవాజ్ పేయి మహిళా అధికారులకు ప్రాముఖ్యం ఇస్తున్నారని భావిస్తున్నారు.అనుపమారావు 1984-92 మధ్య కాలంలో విదేశాంగ శాఖ తూర్పుఆసియా డెస్క్ లో పని చేశారు. కొలంబో, వాషింగ్టన్ లలోని భారతరాయబార కార్యాలయాల్లో పనిచేసిన ఆమె పెరూరాయబారిగా సేవలందించారు.












Click it and Unblock the Notifications