4న హైదరాబాద్‌లో ఎన్‌డిఎ సభ Home Full Story
హైదరాబాద్: తెహెల్కా కుంభకోణం విషయంలో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్‌లో బహిరంగ సభ జరుగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఈ సభలో బిజెపి జాతీయ నేతలు పాల్గొంటారని ఆయన చెప్పారు.
దొడ్డి దారిన అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ తెహెల్కా వివాదాన్ని వాడుకుంటోందని ఆయనవిమర్శించారు. బోఫోర్స్, తదితర కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి తెహెల్కా రక్షణ రంగ వివాదాన్ని కాంగ్రెస్ ఎంచుకుందని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications