వెంకన్న సన్నిధిలో అవినీతి!
హైదరాబాద్‌ః తిరుమలలోస్వామివారి దర్శనం కోసం ప్రవేశ పెట్టిన టోకెన్ విధానంలో, వివిధ నిర్మాణాలలోపెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీనిపై సభా సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బిజెపి చేసిన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుమలలోస్వామి వారిని దర్శించుకొనే వారి సమయాన్ని ఆదా చేసేందుకు సుదర్శనం అనే విధానాన్ని ప్రవేశపెట్టినవిషయం విదితమే. ఈ విధానం ద్వారా ప్రతి భక్తునికి కంప్యూటర్ సహాయంతోస్వామిని సందర్శించుకొనేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో టోకెన్ చూపి ఆ భక్తుడుస్వామి వారిని సందర్శించుకోవచ్చు.
ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్రానికి చెందిన పలు సంస్థలు ముందుకు వచ్చాయిని, కొందరు ఉచితంగా కంప్యూటర్‌సేవలు అందించేందుకు సైతం సిద్ధం అయ్యారని బిజెపి నాయకుడు లక్ష్మణ్ చెప్పారు. అయితే ఉచితంగాసేవలు అందిస్తామన్ని వారిని సైతం కాదని బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీకి రెండు కోట్ల రూపాయలు చెల్లించేందుకు టిటిడి ఎందుకు సిద్ధపడిందని ఆయనవిమర్శించారు. తెలుగుదేశం మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధించడం కాంగ్రెస్ తో సహా వివిధ పార్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇందులో పెద్ద ఎత్తున అక్రమం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఖచ్చితమైన సాక్ష్యాధారాలుఅందజేస్తే ఏ స్థాయిలో అయినా విచారణ జరిపించి, దోషుల్ని శిక్షిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామ రాజుఅసెంబ్లీలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications