జిఎస్‌ఎల్‌విప్రయోగం విఫలం
సూళ్లూరుపేట: ఎంతో ఆసక్తిగాఎదురు చూసిన జియో సింక్రొనస్ లాంచ్ వెహికల్(జిఎస్‌ఎల్‌వి) ప్రయోగం విఫలమైంది. షార్ సెంటర్‌నుంచి జిఎస్‌ఎల్‌విని బుధవారం మధ్యాహ్నంగం. 3.47 నిమిషాలకు ప్రయోగానికి సిద్ధపడ్డారు.ప్రయోగ దశలో మోటార్‌లో మంటలు లేవడంతోజిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలమైంది.
జిఎస్‌ఎల్‌వి ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారంచేయడానికి దూరదర్శన్ అన్ని ఏర్పాట్లుచేసుకుంది. మిషన్ చెడిపోయింది అని దూరదర్శన్ వ్యాఖ్యాతప్రయోగ కేంద్రం నుంచి చెప్పాడు. ఎక్కడ పొరపాటుజరిగిందనేది ఇస్రో బృందం తెలుసుకుని, దాన్ని సరిచేయాల్సి వుందని అతను చెప్పాడు.
మంటలు లేవగానే దూరదర్శన్‌కేంద్రం మిషన్ కంట్రోల్ రూమ్‌పైకి కెమెరాలను తిప్పాయి. ప్రత్యక్ష ప్రసారం అర్థాంతరంగాముగిసింది. ఆ తర్వాత దూరదర్శన్ ఆస్ట్రేలయా, భారత్‌ల మధ్య జరుగుతున్న రెండోవన్డే క్రికెట్ మ్యాచ్‌ను ప్రసారం చేసింది.
మిషన్ కంట్రోల్ రూమ్ వద్దఇస్రో ఛీఫ్ కె. కస్తూరి రంగన్ కూడా వున్నారు.ప్రయోగం విఫలం కావడంతో ఆయన తీవ్ర నిరాశకుగురయ్యారు.
49 మీటర్ల పొడవు, 401 టన్నుల బరువు గలజిఎస్‌ఎల్‌వి ద్వారా 1540 కిలోల బరువు కలిగిన జి-శాట్‌కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి 36 కిలోమీటర్లదూరంలోని అంతరిక్ష కక్ష్యలోకి పంపాలని తలపెట్టారు.












Click it and Unblock the Notifications