లష్కర్-ఎ-తోయిబా ముఖ్యనేత హతం
శ్రీనగర్: లష్కర్-ఎ-తోయిబా అధికార ప్రతినిధి సలావుద్దీన్ బుధవరం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కాశ్మీర్‌లోయలోని మధ్య ప్రాంతంలో గల బాద్‌గామ్ జిల్లా నౌగామ్ సమీపంలో జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసుల చేతిలో అతను మరణించాడు. కాశ్మీర్‌లోయలో భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయంగా పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ అశోక్ బాన్ చెప్పారు. కాశ్మీర్‌లో వివిధ పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాడని, అతని వద్ద సబీర్ అహ్మద్ ఎలక్ట్రీషియన్ పేరుతో ఒక గుర్తింపు కార్డు వుందని ఆయన చెప్పారు.
గతంలో దళ కమాండర్‌గా పని చేసిన సలావుద్దీన్ అయూబి మూడు నెలల క్రితం లష్కర్-ఎ-తోయిబా అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు. సలావుద్దీన్ పాక్ దేశస్థుడని, అతను నాలుగేళ్ల క్రితం కాశ్మీర్‌లో అడుగు పెట్టాడని సమాచారం.












Click it and Unblock the Notifications