తమిళనాడు ఎన్‌డిఎలో ముసలం
చెన్నై: తమిళనాడులోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో ముసలం ప్రారంభమైంది. ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీ ఎండిఎంకె డిఎంకె తీరుపై ధ్వజమెత్తింది. డిఎంకె సీట్ల పంపకంలో వ్యవహరించిన తీరు పట్ల ఎండిఎంకె నేత వైగో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి వ్యూహం గురించి ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
భవిష్యత్తు కార్యక్రమ రూపకల్పనకు వివిధ వర్గాలను కూడా ఆయన సంప్రదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిఎంకె తమకు కోరినన్ని సీట్లు కేటాయించకపోవడమే కాకుండా నియోజకవర్గాల కేటాయింపులో కూడా అన్యాయంగా ప్రవర్తించిందని వైగో అన్నారు. తాము కోరిన నియోజకవర్గాలను కూడా డిఎంకె కేటాయించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications