తల్లీ బిడ్డలకు వరం జననిః బాబు
ఆదిలాబాద్‌ః తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంతోవిలక్షణమైన జనని పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా వాంఖిడిలోశ్రీకారం చుట్టారు. 15వ విడత జన్మభూమి కార్యక్రమానికి నాందిగా చంద్రబాబు నాయుడు ఈ పధకాన్ని ప్రారంభించారు. ప్రతి గర్భిణాస్త్రీకి, శిశువుకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సేవలుఅందించడమే జనని పథకం లక్ష్యమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. 15వ విడత జన్మభూమిని మహిళా జన్మభూమిగా చేపట్టామని, మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ జనని పథకాన్ని నిర్వహించడం జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. సమాజం ఆరోగ్యవంతంగా ఎదగాలంటే మాతా శిశు సంక్షేమం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. గర్భిణీ స్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించడం, అవసరమైన టీకాలు, వైద్య సదుపాయాలు కల్పించడం మొదలు కొని పుట్టిన బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ పథకం ద్వారా అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చంద్రబాబువివరించారు.
ఐదేళ్ళ పాటు ఈ పథకం ద్వారా తల్లీ బిడ్డల సంరక్షణకు గట్టి కృషి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మతా శిశు సంరక్షణకుపెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాంఖిడిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.
మహిళా సంక్షేమం శిరోధార్యంఃబాబు
నిజామాబాద్‌ః మహిళా శిశు సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 15వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి మండలం బొల్లారం లో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు మరింత చైతన్య వంతులైతేనే సమాజంపురోగమిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మహిళాజన్మభూమికి శ్రీకారం
ఆడపిల్లలవిక్రయాల ఆటకట్టుః బాబు
జన్మభూమిలో నిరసనలవెల్లువ












Click it and Unblock the Notifications
