తాడికొండలో కూలినటాంక్-ముగ్గురు మృతి
గుంటూరుః గుంటూరు జిల్లా తాడికొండ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఒక వాటర్ ట్యాంక్ కూలిన దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్పారు.
గుంటూరు కు సమీపంలోని తాడికొండలో వున్న పెద్ద వాటర్ టాంక్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ వున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లుచ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ సంఘటనతో ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇటీవలే నిర్మించిన ట్యాంకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో నిర్మాణ లోపమే దుర్ఘనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
