హైదరాబాద్ బిల్డర్‌కు జుడిషియల్ కస్టడి
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరిపి 9మంది మరణానికి కారణమైన హైదరాబాద్ బిల్డర్ సురేంద్ర అగర్వాల్‌ను ఈ నెల 18వ తేదీ వరకూ జుడిషియల్ కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.
సురేంద్ర అగర్వాల్, ఆయనతోపాటు సురేష్ అగర్వాల్‌లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టుచేసి బుధవారం నాంపల్లిలోని అయిదవ మెట్రోపాలిటన్ కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని సురేంద్ర అగర్వాల్ పత్రికల వారితో అన్నారు. తాను బిల్డర్‌ను కానని తాన సొంత స్థలంలోనే భవన నిర్మాణం చేపట్టానని ఆయన తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ, వానకు నాని గోడకూలితే దానికి తానెలా బాధ్యత వహిస్తానని ఆయన ఆగ్రహంతో ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications