ఇద్దరు నక్సల్స్ ఎన్‌కౌంటర్
వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. వరంగల్ ఏటూరునాగారం శివపూర్ జీడివాగు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరణించిన నక్సలైట్లు వీరన్న వర్గానికి చెందినవారని పోలీసులు చెప్పారు. ఇందులో ఒక మహిళా నక్సలైట్ ఉంది.
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు నక్సలైట్లు ఎదురయ్యారని, పోలీసులను చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, ఇందులో ఇద్దరు నక్సలైట్లు మరణించారని వరంగల్ జిల్లా ఒఎస్‌డి నాగిరెడ్డి చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మారణాయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications