వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి రంగానికి లైసెన్స్‌ అనవసరం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ఐటి పరిశ్రమకు లైసెన్సింగ్‌ విధానం అవసరం లేదని కేంద్ర ఐటి మంత్రి ప్రమోద్‌ మహజన్‌ అభిప్రాయపడ్డారు. ఐటి రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో చేయనున్న చట్టం తాలూకు ముసాయిదా నివేదిక పై దాదాపు గా అన్నిపక్షాల్లో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నదని ఆయన చెప్పారు.

అయితే కొన్ని విషయాలపై మాత్రం మరోసారి ఆలోచించాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు. ఐటి రంగానికి సంబంధించి లైసెన్సింగ్‌ విధానం వుండాలని ముసాయిదా నివేదికలో సూచించారని ఈ సూచనతో తాను ఏకీభవించడం లేదని మంత్రి తెలిపారు. ఐటి రంగానికి లైసెన్సింగ్‌ పద్దతి అవసరం లేదని ఆయన అన్నారు. సిఐఐ నేషనల్‌ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఇ-కామర్స్‌పై నివేదికను ఆయన విడుదల చేశారు.

శరవేగంతో వృద్ధి చెందుతున్న ఐటి రంగానికి లైసెన్సింగ్‌ విధానం అవరోధం కాగలదని ఆయన హెచ్చరించారు. ఐటి బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. కన్వర్జెన్స్‌ బిల్‌పై ఆర్ధికమంత్రి యశ్వంత్‌ సిన్హా సారథ్యంలోని బృందం జులై 11న సమావేశం అవుతుందని ఆయన చెప్పారు. ఇ-కామర్స్‌పై సిఐఐ నివేదికను ఆయన అభినందించారు. ఇది మామాలు నివేదికలా లైదని ప్రభుత్వానికి కార్యాచరణ పథకంలా వున్నదని ఆయన అన్నారు. ఇ-కామర్స్‌ను గ్రామ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లాలంటే పారిశ్రమిక రంగమే చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ సభలో మాట్లాడిన వారు సాఫ్ట్‌వేర్‌ రంగం వృద్ధి రేటుపై విశ్వాసంతోనే వున్నా హార్డ్‌వేర్‌ రంగం విషయంలో మాత్రం అనేక సందేహాలు వ్యక్తం చేశారు. హార్డ్‌వేర్‌ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారుకోరారు.

  • చేతులు కలిపిన ఐఐటి,సిస్కో
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X