కరుణానిధిపై ఎఫ్‌ఐఆర్
చెన్నై: తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి కొందరు మైనార్టీలను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ దాఖలైన కేసు ఎఫ్‌ఐఆర్‌లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరో ముగ్గురి పేర్లను చేర్చారు.
కోయంబత్తూరులో 1998లో పేలుళ్లు జరిగిన విషయం విదితమే. కరుణానిధితో పాటు ఎఫ్‌ఐఆర్‌లో హోం శాఖ మాజీ సెక్రటరి శాంతాషీలానాయర్, మాజీ డిజిపి ఎఫ్‌సి శర్మ, ఐజి కెవిఎస్ మూర్తి వున్నారు. కోయంబత్తూరు పేలుళ్ల కేసులో మైనార్టీలను పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ప్రీతి భాస్కరన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌పై ఎనిమదవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టులోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications