సూపర్‌సానిక్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌

చండీపూర్‌ (ఒరిస్సా): భారత్‌, రష్యా సంయుక్తంగా అభివృద్ధి పరిచిన సూపర్‌ సానిక్‌ క్రూయిజ్‌ క్షిపణి (పిజె-10)ని ఒరిస్సా తీర ప్రాంతంలోని ఇంటెరిమ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటిఆర్‌) నుంచి విజయవంతంగా ప్రయోగించారు. రష్యా ప్రొపల్షన్‌, భారత గైడెన్స్‌ సిస్టమ్‌ ఉపయోగించి దీనిని రూపొందించారు. భారత, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టుకు ఈ క్షిపణిని నాందిగా భావిస్తున్నారు.
క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత, రష్యా శాస్త్రవేత్తలను రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌, ప్రధాని వాజ్‌పేయి అభినందించారు. రక్షణ రంగంలో భారత, రష్యాల సహకారానికి ఈ ప్రయోగం ప్రతీక అని వారన్నారు. భారత రక్షణ శాఖ మంత్రి జస్వంత్‌ సింగ్‌, రష్యా అధ్యక్షుడి ప్రతినిధి హెచ్‌.ఎ. యెఫ్రెమోవ్‌, వందలాది మంది శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణిని మంగళవారం ఉదయం పది గంటల 17 నిమిషాలకు ప్రయోగించారు.

6.9 మీటర్ల పొడవు గల ఈ క్షిపణి ఒకే సమయంలో అనేక వార్‌హెడ్‌లను మోసుకుపోగలదు. ప్రపంచంలో ఇటువంటి క్షిపణిని రూపొందించడం ఇదే ప్రథమమని జస్వంత్‌ సింగ్‌ అన్నారు. ఇది కేవలం 300 సెకన్లలో 280 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదని ఆయన చెప్పారు. ఈ క్షిపణిని మొబైల్‌ లాంచర్లు, యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన ఎన్‌పివొ మషియోస్ట్రోయేనియా మధ్య 1998లో కుదిరిన ఒప్పందం మేరకు ఏర్పడిన బ్రహ్మోస్‌ దీనిని రూపొందించారు. సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ డిజైన్‌, ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌లను బ్రహ్మోస్‌ పర్యవేక్షిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+