సింగరేణి సమ్మె విరమణకు విజ్ఞప్తి
హైదరాబాద్: గత అయిదు రోజులుగా సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికులను సమ్మె విరమించి విధుల్లో చేరాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆరవ వేతన సంఘం బకాయిలకు సంబంధించిన కార్మికుల డిమాండ్‌పై ఢిల్లీలో జాతీయ యూనియన్లు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నాయని కార్మికుల మిగిలిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ అమోదించినందున కార్మికులు సమ్మె విరమించాలని రాష్ట్రమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కోరారు.
కార్మికులు ప్రభుత్వంతో మాట్లాడాలనుకుంటే ప్రభుత్వం వారికెప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే చర్చలకు ప్రభుత్వమే అవరోధాలు కల్పిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూల దృష్టితో ప్రతిస్పందించడం లేదని వారు ఆరోపించారు. ఏడో వేతన సంఘం అమల్లోకి వస్తున్నా ఆరోవేతన సంఘం బకాయిలు ఈనాటి వరకు చెల్లించలేదని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications