పని కావాలంటున్న సహాయ మంత్రులు
న్యూఢిల్లీ: తమకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని కేంద్ర సహాయ మంత్రులు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కోరారు. వారు బుధవారం ప్రధానిని కలిసి ఈ మేరకు ఈ విజ్ఞప్తి చేశారు. తమకు మరింత పని కావాలని ప్రధానిని కోరినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ విలేకరులకు చెప్పారు.
పార్లమెంటులో కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రణాళిక, విధాన నిర్ణయాల్లో తమ పాత్ర వుండాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా రెండు, మూడు విషయాల్లో సహాయ మంత్రులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంటుందని ఆయన అన్నారు..












Click it and Unblock the Notifications