వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్‌ ఫోన్‌లో చాటింగ్‌ సర్వీస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌; పిసిల ముందు తమదైన లోకంలో మునిగిపోయి చాటింగ్‌లో తేలిపోయే యువతీ,యువకులకోసం సరికొత్త చాటింగ్‌ సర్వీస్‌ను హైదరాబాద్‌కు చెందిన విజువల్‌క్వెస్ట్‌ డెవలప్‌చేసింది. మరో లోకం లేనట్టుగా పిసీల ముందే కూచోనక్కరలేకుండా జేబులో మొబైల్‌ఫోన్‌ వుంటే చాలు దానితోనే అప్పటికప్పుడు మెసెజ్‌లు ఇచ్చిపుచ్చుకోవడానికి అనుకూలమై అప్లికేషన్‌ను విజువల్‌క్వెస్ట్‌ డెవలప్‌చేసింది. కేవలం ముడి మెసెజ్‌లు మాత్రమే కాకుండా వాటితో పాటు గ్రాఫిక్స్‌, మనోభావాలకు అనుగుణమైన బొమ్మలను కూడా మొబైల్‌ ద్వారా పంపవచ్చు, అందుకోనూవచ్చు.

ఈ కొత్త సర్వీసు కోసం వివిధ సందర్భాల్లో మన ఆలోచనలను, మనోభావాలను వెల్లడించగల 100 బొమ్మలతో డాటాబేస్‌ను కూడా తయారు చేశారు. విజువల్‌క్వెస్ట్‌ గతంలోనే డెవలప్‌చేసిన విజువల్‌మూవ్‌ ప్లాట్‌ఫాంపై మొత్తం నాలుగురకాల అప్లికేషన్స్‌ను డెవలప్‌చేశారు. దీనివల్ల మొబైల్‌ ఫోన్‌పైనే దృశ్యాలను కూడా చూడవచ్చు. తాము డెవలప్‌చేసిన అప్లికేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు నిర్వహిస్తున్న టాటా సెల్యులార్‌తో విజువల్‌క్వెస్ట్‌ మంతనాలు జరుపుతున్నది.

  • దుబాయ్‌ ఇంటర్నెట్‌సిటీ విస్తరణ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X