25న దేశం అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్తులప్రాదేశిక కమిటీల (ఎంపిటిసి, జడ్‌పిటిసిల) ఎన్నికలకుతెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక సోమవారం జరగవచ్చునని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికచేసేందుకు నాలుగు రోజులుగా నియోజకవర్గాలవారీగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం కూడా ఆయన కొన్నినియోజకవర్గాల నాయకులతో చర్చలుజరిపారు. ఈ సమావేశాలు సోమవారం ముగుస్తాయి. అప్పటికి అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రావచ్చునని పార్టీవర్గాలంటున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి పర్యటన కూడాత్వరలోనే ఖరారు అవుతుందని పార్టీ ప్రధానకార్యదర్శి లాల్ జాన్ బాష విలేకరులకుచెప్పారు.
ఇదిలా వుంటే, సీట్లసర్దుబాటుపై చర్చించేందుకు తెలుగుదేశం, బిజెపిలసమన్వయ కమిటీ ఆదివారం సాయంత్రంసమావేశమవుతోంది.












Click it and Unblock the Notifications