స్థానిక ఎన్నికల్లో తెలంగాణా:నరేంద్ర
హైదరాబాద్: పంచాయతీరాజ్‌ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో బిజెపి ప్రచారంచేస్తుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మెదక్ పార్లమెంటు సభ్యుడు ఎ. నరేంద్రఅన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం బిజెపి నేతలు ఒకవైపు చర్చలు జరుపుతుండగా బిజెపిలోని ఒకవర్గం ప్రత్యేక తెలంగాణా డిమాండ్ పట్ల తమవైఖరిని మార్చుకోకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది.పంచాయతీరాజ్ ఎన్నికల్లో తమ వాదన తామువినిపిస్తామని ఆయన సోమవారం విలేకరులసమావేశంలో చెప్పారు. బిజెపి మాత్రమే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్నిసాధిస్తుందని, మరే పార్టీ కూడా సాధించలేదనిఆయన అన్నారు.
స్థానిక సంస్థల తర్వాత తమకేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుడిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలాచేస్తామని, కేంద్ర నాయకత్వం సానుకూలంగాప్రతిస్పందిస్తుందనే నమ్మకం తమకుఉన్నదని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకుఅనుకూలమైన వాతావరణం కల్పించేందుకు బిజెపి కృషిచేస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణా బిజెపిఫోరమ్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications