పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
హైదరాబాద్: పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసేవారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్టుగా హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాది తొలి ఆరునెలల కాలంలోనే లక్ష పాస్‌పోర్టులను జారీ చేసినట్టుగా కూడా కార్యాలయం ప్రకటించింది.
జిల్లా ప్రధాన కేంద్రాల్లో కూడా పాస్‌పోర్టు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు తెలిపారు. తాజా చర్యల వల్ల పాస్‌పోర్టు కార్యాలయం వద్ద రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సత్వరం పాస్‌పోర్టులు జారీ చేయడానికి అవకాశం వుంటుందని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications