వేర్పాటువాదంకాదు: కెసిఆర్
వరంగల్: తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం నడుపుతున్నఉద్యమం వేర్పాటువాదం కాదని తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) నేత కె. చంద్రశేఖర్ రావు అన్నారు.పంచాయతీరాజ్ ఎన్నికల ప్రచార పర్యటననుఆయన హెలికాప్టర్ ద్వారా జరుపుతున్నారు. ఆయనవరంగల్ జిల్లాలోని చేర్యాల సభలోప్రసంగించారు. రాష్ట్రం నుంచి విడిపోయి మరొక రాష్ట్రం ఏర్పాటుచేయాలని తాము కోరడం లేదని, ఉన్న తెలంగాణా రాష్ట్రాన్నిపునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామనిఆయన అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపైఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణాఉద్యమంపై ప్రజలను పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రివిమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుహైటెక్ పాలన పేదలకు ఉపయోగ పడేదికాదని ఆయన అన్నారు. డ్వాక్రా గ్రూప్‌ల వల్ల మహిళల అభివృద్ధి సంపూర్ణంకాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications