ఉచిత విద్యుత్ ఇచ్చి చూపిస్తాంః కాంగ్రెస్
విజయవాడః రైతులకు ఉచితంగావిద్యుత్ పంపిణీ చేయడం అక్షరాలా సాధ్యం అవుతుందని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు అన్నారు. రైతులకు ఉచితవిద్యుత్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఉచితవిద్యుత్ ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు నాయుడువిమర్శించారు. ఆ విమర్శలను ఎం.సత్యనారాయణ రావు తిప్పి కొట్టారు. ఈవిషయంపై కావాలంటే బహిరంగ చర్చకు సైతం సిద్ధమేనంటూ ఎం.ఎస్.ఆర్. చంద్రబాబుకు సవాలువిసిరారు.
స్థానిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన కృష్ణా జిల్లాకైకలూరు, కలిదిండి, మచిలీపట్నంలలో జరిగిన ర్యాలీలలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల రుణాలు తీసుకువచ్చి వాటిని రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతున్నారని ఆయనవిమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయల అప్పు తెచ్చినా వాటిని అభివృద్ధి కోసం వెచ్చించకుండా ఆడంబరాలకు ఖర్చు చేస్తున్నారని ఎమ్మెస్సార్ దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications