పంచాయతీ పోరులో దేశంతో బిజెపిఖటీఫ్!
హైదరాబాద్‌ః పంచాయతీ సంస్థలకు జరుగుతున్న ఎన్నికలతో పాటు త్వరలో జరిగే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీకి దూరంగా వుండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన సంస్థాగత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం వల్ల బిజెపి తీవ్రంగా నష్టపోయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది.
కేవలం 50 ఎం.పి.టి.సిల్లో మాత్రమే దేశం-బిజెపి మధ్య పొత్తు కుదరగామిగిలిన 150 చోట్ల బిజెపి సొంతంగానే పోరాడాల్సి వచ్చింది. దీనివల్ల బిజెపితో పాటు తెలుగుదేశం కూడా నష్టపోయిందని పదాధికారుల సమావేశం అభిప్రాయపడింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీతో కూడా అధికారపూర్వక ఒప్పందం లేదని పార్టీ నేత కిషన్ రెడ్డివిలేకరులకు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నప్పటికీ లోపాయకారీగా కూడా ఏ పార్టీతో కూడా చెలిమి చేయరాదని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీతో సంస్థాగత ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవడం వల్లే బిజెపికి గట్టి దెబ్బ తగిలిందని భావించనందునే బిజెపి ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఇకపోతే బిజెపి పదాధికారుల సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్ని కరవు పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు యు.కృష్ణంరాజు,విద్యాసాగర్ రావు, చిలకం రామంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications