హద్దుమీరితే బుద్ధిచెబుతాంః వాజ్‌ పేయి

న్యూఢిల్లీః పాకిస్తాన్‌ సైనికాధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషారఫ్‌ మొండివైఖరి కారణంగానే ఆగ్రా శిఖరాగ్ర సదస్సువిఫలం అయిందని ప్రధాని వాజ్‌ పేయి ప్రకటించారు. కాశ్మీర్‌ భారత్‌ లో అంతర్భాగమని.... పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పకపోతే భారత్‌ చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.

ఆగ్రా సదస్సు చివరిలో ఉమ్మడి ముసాయిదా వెల్లడించక పోవడానికి కూడా పాక్‌ మొండి వైఖరే కారణం అన్నారు. ఆగ్రా సదస్సుపై జరిగిన చర్చకు వాజ్‌పేయి లోక్‌ సభలో సమాధానం ఇచ్చారు. వాజ్‌ పేయి సుమాలు 40 నిమిషాలసేపు ఆవేశంగా ప్రసంగించారు. ఉమ్మడి ముసాయిదాలో కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని, సివ్లూ ఒప్పందాన్ని చేర్చేందుకు పాక్‌ ససేమిరా అన్నదన్నారు. కాశ్మీర్‌ భారత్‌ లో అంతర్భాగమేనని ముషారఫ్‌ కు తేల్చి చెప్పినట్లు వాజ్‌పేయి చెప్పారు.
సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దానినిస్వతంత్ర పోరాటంగా పాక్‌ అభివర్ణించడాన్ని వాజ్‌పేయి తీవ్రంగా విమర్శించారు. పాక్‌ తన వైఖరిని మార్చుకుంటే కాశ్మీర్‌ పై చర్చకు భారత్‌ సిద్ధంగా వుందని వాజ్‌పేయి వెల్లడించారు.

ప్రతిపక్షాల పెదవి విరుపు
ఆగ్రా సదస్సు నిర్వహించిన తీరు, ఆగ్రా సదస్సుపై ప్రధాని వాజ్‌పేయి ఇచ్చిన వివరణ పట్ల ప్రతిపక్షాలు అసంతృప్తి ప్రకటించాయి. ఆగ్రాసదస్సుకు ప్రభుత్వం సరిగా సిద్ధం కాలేదని, చివరకు పాకిస్తాన్‌ దేపైచేయిగా మారిందని కాంగ్రెస్‌, సమాజ్‌ వాది పార్టీలువిమర్శించాయి. పాక్‌ కుతంత్రాలను ప్రపంచానికి చాటి చెప్పడంలో వాజ్‌పేయి విఫలం అయ్యారని
ఆ పార్టీలు ధ్వజమెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+