వచ్చే వారం కరవు నివేదిక
హైదరాబాద్: రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత నాలుగయిదురోజుల్లో తాము కేంద్రప్రభుత్వానికి తమ నివేదిక అందజేస్తామని కేంద్ర పరిశీలకుల బృందం ప్రకటించింది. సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర పరిశీలకులు రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలోని కరవు బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
ఒక బృందం కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మరో బృందం కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తుంది. తొమ్మిదో తేదీన ఈ బృందం తొమ్మిదోతేదీన ఢిల్లీ తిరిగి వెళ్లుతుంది. ఢిల్లీ వెళ్లిన తర్వాత నాలుగయిదు రోజుల్లో నివేదికను తయారు చేసి కేంద్రానికిఅందజేస్తామని పరిశీలకుల బృందం ప్రతినిధి చెప్పారు.
సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఈ పరిశీలకుల బృంద రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తొలి విడద సమావేశం అయింది. పరిస్థితిని గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కరవు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించింది.












Click it and Unblock the Notifications