కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
హైదరాబాద్‌ః ఆంధ్ర ప్రదేశ్ లో కరవు పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర బృందం మంగళవారం రెండు బృందాలుగా విడిపోయి ఆరు జిల్లాలను పరిశీలించింది. కరవు తీవ్రంగా వుందని...తక్షణం తగిన సాయం చేయాల్సిందిగా మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండల ప్రజలు కేంద్ర బృందాన్ని నిలదీశారు. వానలు లేక పంటలు ఎండిపోయాయని, తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్ళు కూడా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు లేకకొంపాగోడు అమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్నామని వారు కేంద్ర బృందానికి తెలిపారు. ఖాళీ బిందెలు, ఎండిపోయిన మొక్కలతో ప్రజలు ప్రదర్శన నిర్వహించారు.
మహిళలు, రైతులు కరవు బృందాన్ని పలు చోట్ల నిలిపివేసి తమ దుస్థితిని చూడాల్సిందిగాకోరారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవలసి వస్తున్నదని మహిళలు చెప్పారు. తినేందుకు తిండిలేక పలువురు నగరానికి కూలీలుగా వలసపోతున్నారని వారు చెప్పారు. నీరెండిపోయిన బావులకువిద్యుత్ బిల్లుల వసూళ్ళు ఆపాలని, తక్షణం పశుగ్రాసం ఇవ్వాలని, పనికి ఆహారం పథకాన్ని అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో పర్యటించిన ఒక బృందం వానలు లేక ఎండిపోయిన చెరువులను సందర్శించింది. ఆయా జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు, ఎమ్మెల్ల్యేలు కేంద్ర బృందానికి కరవు పరిస్థితినివివరిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. మరో బృందం కడప, ప్రకాశం జిల్లాలో పర్యటించింది. కడప జిల్లాలోని వల్లూరు మండలంలోని కరవు పరిస్థితిని కేంద్ర బృందం పరిశీలించింది. కడప మండలంలోనికె.సి. కెనాల్ ను కూడా బృందం పరిశీలించింది. బుధవారం కూడా వివిధ జిల్లాల్లో పర్యటించిన అనంతరం పరిస్థితిని కేంద్రానికివివరిస్తామని బృందం సభ్యులు తెలిపారు.
- వచ్చే వారం కరవు నివేదిక
- వెయ్యికోట్లకులెఫ్ట్ డిమాండ్












Click it and Unblock the Notifications