ముఖ్యమంత్రికి మరింత భద్రత
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతా చర్యలను మరింత పెంచారు. పార్టీ కార్యాలయంలో ప్రస్తుతమున్న భద్రతా చర్యలను మరింత మెరుగుపర్చారు. చంద్రబాబుకు రెండు నెలల క్రితమే ఎస్‌పిజి రక్షణ కల్పించాలని ప్రతిపాదించినప్పటికీ ముఖ్యమంత్రి దానిని తిరస్కరించారు.
ఎస్‌పిజి కవచం వల్ల ప్రజల్లోకి వెళ్లడానికి, ప్రజలు తనను కలవడానికి అవరోధం ఏర్పడుతుందని భావించిన ముఖ్యమంత్రి ఎస్‌పిజి రక్షణను తిరస్కరించారు. ముఖ్యమంత్రి ఎస్‌పిజిని తిరస్కరించినప్పటికీ ఎస్‌పిజికి దీటైన స్థాయిలో రాష్ట్ర పోలీసులే ఆయనకు రక్షణ కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఇంటలీజెన్స్ ఐజి సారథ్యంలో ముఖ్యమంత్రి భద్రత కోసం చర్యలను తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications