కరవు మండలాలకు బాబుప్యాకేజ్
హైదరాబాద్‌ః కరవుతో అల్లాడుతున్న ఆంధ్రరాష్ట్ర ప్రజలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. కరవు తీవ్రంగా వున్న 911 మండలాల్లో పనికి ఆహారం పథకం కింద ఐదుకిలోల బియ్యం, రోజూ 30 రూపాయల నగదు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో వెల్లడించారు. రాష్ట్రంలో కరవు తీవ్రంగా వున్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణం 850 కోట్లు రూపాయ సాయంఅందించాల్సిందిగా ఆయన కోరారు.
నాలుగు రోజులుగా వర్షాలు పడినప్పటికీవీటివల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని, రిజర్వాయర్లలోకి నీరు రాలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఈఅంశాలను కేంద్ర బృందం దృష్టిలో పెట్టుకొని నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రికోరారు. బుధవారం కేంద్ర బృందాన్ని కలుసుకొని ఇదేవిషయాన్ని విన్నవిస్తానని చంద్రబాబు అన్నారు.
ఏలేరుపై మరోకమిషన్ ప్రసక్తి లేదు
ఏలేరు కుంభకోణం పై సిబిసిఐడివిచారణ నిర్వహించామని, ఆ వ్యవహారం అంతటితో ముగిసిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్చి చెప్పారు. సోమశేఖర కమిషన్ ను తిరిగి ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌అర్థం లేనిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications