ఏలేరుపై కాంగ్రెస్ భారీ ర్యాలీ
హైదరాబాద్‌ః ఏలేరు భూ కుంభకోణంపై గతంలో ఏర్పాటు చేసిన సోమశేఖర కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసనగా కాంగ్రెస్ మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్ సోమాజి గూడలోని రాజీవ్ గాంధీవిగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు ఈ ర్యాలీకి సారధ్యం వహించారు.
తన బండారం బయటపడుతుందనే చంద్రబాబు నాయుడు ఏలేరు కుంభకోణంపై సుప్రీంకోర్టు సైతం ఆమోదించిన సోమశేఖర కమిషన్ ను అర్థాంతరంగా రద్దు చేసిందని ఎమ్మెస్సార్ ధ్వజమెత్తారు. ఏలేరు కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి చంద్రబాబు నాయుడు పనిపడతాం అని ఎమ్మెస్సార్ నినదించారు. వామపక్ష పార్టీలతో త్వరలో చర్చలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications